ప్రపంచమంతా ఉక్రెయిన్ వైపే.. అసలు చరిత్ర ఏంటి?

ప్రపంచమంతా ఉక్రెయిన్ వైపే.. అసలు చరిత్ర ఏంటి?
  • విస్తీర్ణం     : 6,03,628 చ.కి.మీ.
  • జనాభా    : 4.41 కోట్లు 
  • ఉక్రెనియన్లు     : 77.8 శాతం 
  • రష్యన్లు     : 17.3 శాతం 
  • ఇతరులు    : 4.9 శాతం

ఇప్పుడు ఎక్కడ చూసినా ఉక్రెయిన్‌‌ గురించే చర్చ. ప్రపంచమంతా ఉక్రెయిన్‌‌ వైపే చూస్తోంది. ‘రష్యా దాడుల వల్ల జరిగిన నష్టం నుంచి ఉక్రెయిన్‌‌ ఎలా బయటపడు తుందో!’ అనుకుంటున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌‌ చాలా సంపన్నమైన దేశం. అక్కడ విలువైన ఖనిజాలు, ఫ్యాక్టరీలు ఎన్నెన్నో ఉన్నాయి. సిరులు పండే సారవంతమైన భూములు ఉన్నాయి. సోవియట్‌‌ యూని యన్ నుంచి విడిపోగానే కమ్యూనిస్ట్ విధానాలను పక్కన పెట్టి.. మార్కెట్‌‌ ఎకానమీ దిశగా అడుగులు వేసింది. అందుకే.. తక్కువ టైంలోనే బాగా డెవలప్ అయింది. చాలా దేశాలతో ఉక్రెయిన్‌‌ వ్యాపారాలు చేస్తోంది.

కొన్ని వందల సంవత్సరాలు ఉక్రెయిన్​ వేరే దేశాల పాలనలోనే మగ్గిపోయింది. చివరకు 1922లో సోవియట్‌‌ యూనియన్ ఏర్పడినప్పుడు అందులో చేరింది. దాదాపు 70 ఏండ్ల పాటు సోవియట్‌‌ యూనియన్ నీడలోనే ఉంది. ఇది సోవియట్‌‌ యూనియన్‌‌లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది. దానికి కారణం.. ఆ దేశానికున్న సహజ సంపద. చివరకు 1991లో స్వతంత్రం తెచ్చుకుంది. కానీ.. ఉక్రెయిన్‌‌ పుట్టి ముప్పై రెండేళ్లు కూడా దాటకముందే ఇంతటి భయంకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్ స్వతంత్రం పొందినప్పటి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజులు గడిచిన కొద్దీ రెండు దేశాల మధ్య పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. అదే టైంలో ఉక్రెయిన్‌‌ యూరప్‌‌లోని చాలా దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకుంది. తర్వాత ఐరోపా దేశాల అండకోసం నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. దాంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలే యుద్ధానికి దారి తీశాయి. ఈ యుద్ధానికి ముందు కూడా కొన్ని విషయాల్లో రష్యా ఉక్రెయిన్‌‌ని ఇబ్బంది పెట్టింది. అదే టైంలో దేశంలో రాజకీయ సంక్షోభాలను, అంతర్గత పోరాటాలను ఎదుర్కొంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా రష్యాలాంటి దేశాన్ని కూడా ఎదిరించి నిలబడేంత శక్తిని కూడగట్టుకుంది. అందుకు ఆ దేశంలో ఉన్న కొన్ని వనరులు, వాళ్లు ఎంచుకున్న విధానాలే కారణం. 

పట్టణాలే పట్టుగొమ్మలు

ఉక్రెయిన్‌‌కు పట్టణాలే పట్టుగొమ్మలు. అందుకే ఆ దేశ జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటున్నారు. ఆగ్నేయ, దక్షిణ- మధ్య ఉక్రెయిన్‌‌లో ఎక్కువమంది ప్రజలు ఉంటున్నారు. ఉక్రెయిన్‌‌లో రాజధాని కీవ్‌‌తో పాటు ఖార్కివ్, డ్నిప్రోపెట్రోవ్స్క్, దొనేత్సక్, ఒడెస్సా, జాపోరిజ్జియా, ఎల్వివ్, క్రివీ రిహ్‌‌లులాంటి సిటీల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. మిగిలినవాళ్లలో కూడా ఎక్కువ మంది పెద్ద గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడి నేలలు వ్యవసాయానికి చాలా అనుకూలం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రబ్బరు చక్రాలతో ఉండే గుర్రపు బండ్లు వాడుతుంటారు. మట్టి, గడ్డితో కట్టుకున్న ఇండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. 

జనాభా తగ్గుతోంది

దాదాపు అన్ని దేశాల జనాభా ఏటేటా పెరుగుతుంటే ఈ దేశ జనాభా మాత్రం తగ్గుతూ వస్తోంది.  ప్రస్తుతం ఉక్రెయిన్‌‌ జనాభా 4.41 కోట్లు. తక్కువ జననాల రేటు, వయసు పైబడిన వాళ్లు ఎక్కువగా ఉండడం, మైగ్రేషన్స్‌‌ పెరగడం వల్ల దేశ జనాభా ఏటేటా తగ్గుతోంది. 1992 నాటికి ఉక్రెయిన్‌‌ జనాభా 5.22 కోట్లు. లక్షల మంది ఉక్రెయిన్‌‌ ప్రజలు వేరే దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఉక్రెయిన్‌‌ నుంచి చాలామంది పని కోసం వెళ్లి విదేశాల్లో సెటిల్‌‌ అయ్యారు. 2010 నాటికి దాదాపు ఏడుగురు ఉక్రేనియన్లలో ఒకరు పని కోసం దేశం దాటి వెళ్లారు. వాళ్లలో ఎక్కువమంది రష్యా, యూరప్‌‌ దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లారు. 

ఉక్రెయిన్‌‌ ఆదాయంతో..

ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. సోవియట్‌‌ యూనియన్‌‌లో ఉన్నప్పుడు కూడా ఉక్రెయిన్‌‌ ఎకానమీ బాగానే ఉండేది. అప్పట్లో సోవియట్‌‌ నుంచి ఉక్రెయిన్‌‌ తీసుకునే దానికంటే ఇచ్చేదే ఎక్కువ. ఇండస్ట్రియల్‌‌ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులు తయారు చేసేది. సోవియట్‌‌ యూనియన్‌‌లో ఉండగా మొత్తం ఇండస్ట్రియల్‌‌ ప్రొడక్షన్‌‌లో 17 శాతం, అగ్రికల్చర్‌‌‌‌లో 21శాతం ఉక్రెయిన్‌‌ వాటా ఉండేది. అంతేకాకుండా ఉక్రెయిన్ నుంచి వచ్చే ఆదాయం వల్ల సోవియట్ యూనియన్‌‌లోని చాలా ప్రాంతాలు డెవలప్ చేశారు. ముఖ్యంగా రష్యా, కజకిస్తాన్‌‌లకు బాగా హెల్ప్‌‌ అయ్యింది. కానీ.. సోవియట్ చివరి రోజుల్లో ఉక్రెయిన్‌‌ ఎకానమీ పవర్‌‌‌‌ బాగా తగ్గింది. 1990ల మొదట్లో కరెన్సీ ద్రవ్యోల్బణం.. కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రజలకు ఉక్రెయిన్‌‌లో బతకడం చాలా కష్టమైంది. ధరలు బాగా పెరిగాయి. 1996 నాటికి ఉక్రెయిన్ పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. 21వ శతాబ్దం మొదట్లో రష్యాతో సంబంధాలు పెరగడంతో డెవలప్‌‌మెంట్‌‌ పెరిగింది.

ఇనుముకు కేరాఫ్‌‌

ఉక్రెయిన్‌‌లో ఖనిజ వనరులు కూడా బాగానే ఉన్నాయి. క్రైవీ రిహ్, క్రెమెన్‌‌చుక్, బిలోజర్కా, మారియుపోల్, కెర్చ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనుప ఖనిజం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో మాంగనీస్– -బేరింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉక్రెయిన్‌‌లోని నికోపోల్ ఒకటి. బొగ్గు నిల్వలు కూడా ఉక్రెయిన్‌‌లో బాగానే ఉన్నాయి. ఈ దేశంలోని బొగ్గు గనులు యూరప్‌‌లోనే ఎక్కువ లోతైనవి. టైటానియం, బాక్సైట్, నెఫెలైన్, అల్యూనైట్, పాదరసం కూడా బాగా దొరుకుతాయి. సబ్‌‌కార్పాతియన్ ప్రాంతంలో నేచురల్‌‌ గ్యాస్‌‌, పెట్రోలియం కూడా బాగా ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1960ల మొదట్లో సోవియట్ యూనియన్ ఉక్రెయిన్‌‌లో నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్‌‌ని పెంచింది. దాంతో 1975 తర్వాత నిల్వలు తగ్గాయి.  అయితే.. అంతకుముందే రష్యా నుంచి ఉక్రెయిన్‌‌కు గ్యాస్ పైప్‌‌లైన్లు వేశారు. 1920లలో వేసిన పైప్‌‌లైన్‌‌ ఎల్వివ్‌‌, కీవ్‌‌ నగరాలను కనెక్ట్ చేసి ఉంది. 1960ల చివరలో రష్యా నుంచి తూర్పు, పశ్చిమ యూరప్‌‌కు గ్యాస్‌‌ను ఎగుమతి చేయడానికి ఉక్రెయిన్ అంతటా రెండు ట్రంక్ పైప్‌‌లైన్లు వేశారు. 

కరెంట్‌‌ 

ఉక్రెయిన్ కరెంట్‌‌ అవసరాల కోసం నేచురల్‌‌ గ్యాస్‌‌, థర్మల్‌‌, న్యూక్లియర్ పవర్‌‌‌‌పై ఆధారపడింది. దేశంలో వాడుతున్న కరెంట్‌‌లో హైడ్రో పవర్‌‌‌‌ వాటా 10 శాతం కంటే తక్కువ. బొగ్గు బాగానే దొరుకుతుండడంతో థర్మల్‌‌ పవర్ స్టేషన్ల ద్వారా కరెంట్‌‌ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఖ్మెల్నిట్స్కీ, రివ్నే, జాపోరిజ్జియా సిటీలకు దగ్గర్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. 

మాన్యుఫ్యాక్చరింగ్‌‌

ఉక్రేనియన్ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. దేశంలో తయారయ్యే వస్తువుల్లో ఫెర్రస్ మెటల్స్‌‌, ట్రాన్స్‌‌పోర్టేషన్ ఎక్పిప్‌‌మెంట్‌‌, మెషినరీస్‌‌ ఎక్కువగా ఉన్నాయి. ఉక్రెయిన్‌‌లోని ఫెర్రస్ మెటల్‌‌ ఇండస్ట్రీ ప్రపంచంలోనే పెద్దది. ఇనుము, ఉక్కు పైపులు కూడా ఎక్కువగా ప్రొడ్యూస్‌‌ అవుతున్నాయి. ట్రక్కులు, రైల్వే లోకోమోటివ్‌‌లు, నౌకలు, టర్బైన్‌‌లు, జనరేటర్లు ఎక్కువగా ప్రొడ్యూస్‌‌ చేస్తున్నారు. సోవియట్ యూనియన్ కాలంలో ఉక్రెయిన్‌‌లోని ప్లాంట్లలో రాకెట్లు,  విమానాలు, షిప్‌‌లు కూడా తయారుచేశారు. ఇప్పుడు ఆయుధాల్ని కూడా ఉక్రెయిన్ ఎగుమతి చేస్తోంది. రసాయన ఎక్విప్‌‌మెంట్‌‌ తయారీలో మాజీ సోవియట్‌‌లోనే మూడింట ఒక వంతు వాటా ఉక్రేనియన్‌‌కు ఉండేది.  కైవ్‌‌, సుమీ, ఫాస్టివ్, కొరోస్టన్‌‌ ప్రాంతాల్లో ఈ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, సింథటిక్ ఫైబర్స్, కాస్టిక్ సోడా, పెట్రోకెమికల్స్, ఫోటోగ్రాఫిక్ కెమికల్స్‌‌, పెస్టిసైడ్స్ తయారు అవుతున్నాయి. 

ప్రాసెసింగ్ ఫుడ్‌‌

ఉక్రేనియన్ ఫుడ్ -ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ప్రాసెస్‌‌ చేసిన మాంసం, మిల్లెట్స్‌‌, ఫ్రూట్స్‌‌, మిల్క్‌‌ ప్రొడక్ట్స్‌‌ ఎక్కువగా ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నారు. ఒడెస్సా లాంటి తీరప్రాంత నగరాల్లో చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ వోడ్కా, బీర్​కు కూడా చాలా ఫేమస్. ఉక్రెయిన్ ఎన్నో ఏళ్ల నుంచి బ్రెడ్‌‌ని కూడా ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తోంది. ఉక్రెయిన్‌‌లో తయారయ్యే బ్రెడ్​కు విదేశాల్లో చాలా డిమాండ్‌‌ ఉంటుంది. ఆ బ్రెడ్ చాలా టేస్టీగా, క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడి నుంచి గోధుమలు కూడా ఎక్కువగా ఎక్స్‌‌పోర్ట్‌‌ అవుతుంటాయి. అందుకే ఉక్రెయిన్‌‌ని ‘ప్రపంచ బ్రెడ్‌‌బాస్కెట్’ అని పిలుస్తుంటారు.  

డైలీ లైఫ్‌‌

ఉక్రెయిన్‌‌కు స్వతంత్ర దేశమయ్యాక చాలా తక్కువ టైంలోనే దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కీవ్‌‌ సొసైటీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కీవ్‌‌ సిటీ సంపన్నులు ఉండే ప్లేస్‌‌గా మారింది. సిటీలో చాలా హై-ఎండ్ స్టోర్లు ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీలు, కేఫ్‌‌లు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంటాయి. దాదాపు అన్ని సిటీలు చెట్లతో పచ్చగా కనిపిస్తాయి. ప్రతి రోడ్డుకు పుట్‌‌పాత్‌‌ ఉంటుంది. ఉక్రెయిన్‌‌లలో చాలామందికి వాకింగ్‌‌ అలవాటు. అందుకే దేశంలో పార్కులు పుష్కలంగా ఉన్నాయి. ఉక్రెనియన్లు ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాదాపు అన్ని సిటీల్లో థియేటర్లు ఉన్నాయి. ఇక అక్కడివాళ్లకు సంగీతం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. చాలామంది రోడ్లపై కూడా మ్యూజిక్ షోలు చేస్తుంటారు. సిటీల్లో డాన్స్ క్లబ్‌‌లు, క్యాబరేలు చాలా రొటీన్‌‌. 

పందులు కట్నంగా.. 

వ్యవసాయానికి అనువైన ప్రాంతం కావడంతో ఉక్రెయిన్‌‌లో పంటలు బాగా పండుతాయి. ధాన్యాలు, ఆలుగడ్డల ఎగుమతుల్లో యూరప్‌‌లోనే మొదటిస్థానంలో ఉంది ఉక్రెయిన్‌‌. షుగర్‌‌‌‌ బీట్స్‌‌, సన్‌‌ ఫ్లవర్ ఎక్కువగా పండించే టాప్‌‌ దేశాల లిస్ట్‌‌లో ఇది కూడా ఉంది. షుగర్‌‌‌‌ బీట్స్‌‌ ఒక రకమైన గడ్డ. చెరుకులాగే ఈ గడ్డల నుంచి కూడా చక్కెర తయారు చేస్తారు. వ్యవసాయంతో పోలిస్తే పశువుల పెంపకంలో ఉక్రెయిన్‌‌ వెనుకబడింది. అక్కడ ఉండే నల్ల భూములు షుగర్ బీట్స్‌‌, గోధుమతోపాటు వాణిజ్య పంటలకు చాలా అనువైనవి. ఈ నేలల్లో ఉక్రెయిన్ బార్లీ, మొక్కజొన్న, చిక్కుళ్ళు, మిల్లెట్స్‌‌, వరి కూడా పండుతాయి. ఆముదం, ఆవాలు, అవిసె, జనపనార, యాలకులు కూడా పండిస్తారు. దక్షిణ ప్రాంతంలో టొమోటోలు, మిరియాలు, పుచ్చకాయలు పండిస్తున్నారు. ఉక్రెయిన్ అంతటా పశువులు, పందుల్ని పెంచుతారు. ఈ దేశంలో పందులకు స్పెషాలిటీ ఉంది. ఎన్ని ఎక్కువ పందులు ఉంటే అంత గొప్పగా ఫీలవుతారు. ఇప్పటికీ పేదల ఇండ్లల్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే అల్లుళ్లకు పందులను కట్నంగా ఇస్తున్నారు. అడవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే  పాడి పశువులు ఉంటాయి. కోళ్లు, పెద్ద బాతులు, టర్కీలను మాంసం కోసం ఉక్రెయిన్ అంతటా పెంచుతుంటారు. సోవియట్ యూనియన్‌‌లో భాగంగా ఉన్న రోజుల్లో ఇక్కడ కలెక్టీవ్‌‌ ఫామ్‌‌ సిస్టమ్‌‌ మొదలుపెట్టారు. అంటే.. కొంత భూమిలో కొంత మంది రైతులు కలసి వ్యవసాయం చేస్తారు. వచ్చిన లాభాన్ని అందరూ సమానంగా తీసుకుంటారు. ఈ సిస్టమ్‌‌ని గవర్నమెంట్‌‌ నడిపిస్తుంది. ఇందులో భాగంగా పశువుల పెంపకం, పౌల్ట్రీని డెవలప్ చేశారు. కానీ.. 1999లో ఈ పద్ధతిని పూర్తిగా వదిలేశారు. ఒకప్పుడు బ్లాక్‌‌ సీలో బాగా చేపలు పట్టేవాళ్లు. డ్నీపర్, డానుబే, డైనిస్టర్, సదరన్ నదుల్లో చేపలు పడుతూ కొన్ని లక్షల మంది బతికేవాళ్లు. కానీ.. ఇప్పుడు కాలుష్యం వల్ల చేపలు పట్టడం బాగా తగ్గిపోయింది.

రష్యాతో వ్యాపారం

రష్యాతోపాటు జర్మనీ, ఇటలీ, పోలాండ్, చైనా, టర్కీ, అమెరికా దేశాలతో వ్యాపారం చేస్తోంది ఉక్రెయిన్‌‌. రష్యా నుంచి పెట్రోలియం, పెట్రోలియం ప్రొడక్ట్స్‌‌, నేచురల్‌‌ గ్యాస్‌‌, క్లాత్స్‌‌,  చెప్పులు దిగుమతి చేసుకుంటుంది. యంత్రాలు, ట్రాన్స్‌‌పోర్టేషన్ ఎక్విప్‌‌మెంట్స్‌‌, కెమికల్స్ రష్యాకు ఎగుమతి చేస్తుంది. 

వేల సంవత్సరాల చరిత్ర

ఉక్రెయిన్‌‌కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.పూ. 32,000 క్రితమే ఇది ఒక రాజ్యంగా గుర్తింపు పొందింది. పదో శతాబ్దం వచ్చేనాటికి అనేక రాజ్యాలు కలిసి పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది. దాన్ని ‘కీవన్‌‌ రస్‌‌’ లేదా ‘వ్లాదిమీర్ రస్‌‌’ అని పిలిచేవాళ్లు. ఉక్రెయిన్‌‌ నుంచి బాల్టిక్ సముద్రం వరకు ఈ సామ్రాజ్యం ఉండేది. ప్రస్తుత ఉక్రెయిన్‌‌, రష్యా, బెలారస్‌‌లు కూడా ఈ రాజ్యంలోనే ఉండేవి. ఈ సామ్రాజ్యాన్ని 10వ శతాబ్దంలో ‘వ్లాదిమీర్‌‌ ది గ్రేట్‌‌’ పాలించాడు. అందుకే ఉక్రెయిన్, రష్యాల్లో చాలామంది పేరుకు ముందు వ్లాదిమీర్ అని పెట్టుకుంటారు. వ్లాదిమీర్‌‌ ది గ్రేట్‌‌ని ఆధునిక రష్యా పితామహుడిగా కూడా చెప్తుంటారు. అయితే.. ఉక్రెనియన్లను కూడా ఆయనే పాలించడంతో ఉక్రెయిన్‌‌ పితామహుడిగా చెప్తారు. ఒకప్పుడు ఒకే రాజు పాలనలో ఉన్న రాజ్యాలు ఇప్పుడు కూడా ఒకే గొడుగు కింద ఉండటమే మంచిదని పుతిన్‌‌ వాదన. 13వ శతాబ్దంలో వ్లాదిమీర్ ది గ్రేట్ తర్వాత సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ తర్వాత దాదాపు 600 సంవత్సరాలు ఉక్రెయిన్‌‌ను చుట్టు పక్కల దేశాలే పాలించాయి. లిథువేనియా, పోలాండ్, ఆస్ట్రియా, -హంగేరిలతో పాటు రష్యా కూడా ఉక్రెయిన్‌‌ని పాలించింది. 1917లో జరిగిన రష్యా విప్లవం తర్వాత 1922లో యు.ఎస్.ఎస్.ఆర్ (యూనియన్ ఆఫ్‌‌ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్‌‌) ఏర్పడింది. అప్పుడు ఉక్రెయిన్ కూడా అందులో కలిసిపోయింది. అప్పటినుంచి 1991 వరకు సోవియన్‌‌ యూనియన్‌‌లోనే ఉంది. 1991లో సోవియట్ యూనియన్ ముక్కచెక్కలైపోయినప్పుడు ఉక్రెయిన్‌‌ కూడా విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌‌ అన్ని రంగాల్లో బాగా డెవలప్‌‌ అయింది. 

జ్యూస్‌‌.. వలసలు

సోవియట్‌‌ యూనియన్‌‌లో కలిసి ఉన్నప్పుడు ఉక్రెయిన్‌‌కు చుట్టు పక్కల దేశాల నుంచి, రష్యా నుంచి వలస వచ్చేవాళ్లు. కానీ.. ఆ తర్వాత సీన్‌‌ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. 1959లో దేశ జనాభాలో ఉక్రెనియన్లు 77 శాతం ఉండేవాళ్లు. 1991లో అది 73 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఈ దేశంలో రష్యన్లు అతిపెద్ద మైనారిటీ గ్రూప్‌‌గా ఉన్నారు. రష్యన్లతోపాటు బెలారసియన్లు, మోల్డోవాన్లు, బల్గేరియన్లు, పోల్స్, హంగేరియన్లు, రొమేనియన్లు కూడా ఉక్రెయిన్‌‌లో ఉంటున్నారు. గతంలో ఉక్రెయిన్‌‌లో జ్యూస్‌‌, పోలిష్ ప్రజలు ఎక్కువగా ఉండేవాళ్లు. 19వ శతాబ్దం చివరలో ప్రపంచంలోని యూదు జనాభాలో నాలుగింట ఒక వంతు ఉక్రెయిన్‌‌లోనే ఉండేవాళ్లు. 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం మొదట్లో చాలామంది ఇక్కడినుంచి వలస పోయారు. మిగిలినవాళ్లలో కొందరు 1980ల చివరలో, 90వ దశకంలో ఇజ్రాయెల్‌‌కు వెళ్లిపోయారు. ఇక మిగిలిన జ్యూస్‌‌ ఉక్రేనియన్ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ.
కొన్ని వందల సంవత్సరాలు ఉక్రెయిన్​ వేరే దేశాల పాలనలోనే మగ్గిపోయింది. చివరకు 1922లో సోవియట్‌‌ యూనియన్ ఏర్పడినప్పుడు అందులో చేరింది. దాదాపు 70 ఏండ్ల పాటు సోవియట్‌‌ యూనియన్ నీడలోనే ఉంది. ఇది సోవియట్‌‌ యూనియన్‌‌లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది. దానికి కారణం.. ఆ దేశానికున్న సహజ సంపద. చివరకు 1991లో స్వతంత్రం తెచ్చుకుంది. కానీ.. ఉక్రెయిన్‌‌ పుట్టి ముప్పై రెండేళ్లు కూడా దాటకముందే ఇంతటి భయంకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్ స్వతంత్రం పొందినప్పటి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజులు గడిచిన కొద్దీ రెండు దేశాల మధ్య పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. అదే టైంలో ఉక్రెయిన్‌‌ యూరప్‌‌లోని చాలా దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకుంది. తర్వాత ఐరోపా దేశాల అండకోసం నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. దాంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలే యుద్ధానికి దారి తీశాయి. ఈ యుద్ధానికి ముందు కూడా కొన్ని విషయాల్లో రష్యా ఉక్రెయిన్‌‌ని ఇబ్బంది పెట్టింది. అదే టైంలో దేశంలో రాజకీయ సంక్షోభాలను, అంతర్గత పోరాటాలను ఎదుర్కొంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా రష్యాలాంటి దేశాన్ని కూడా ఎదిరించి నిలబడేంత శక్తిని కూడగట్టుకుంది. అందుకు ఆ దేశంలో ఉన్న కొన్ని వనరులు, వాళ్లు ఎంచుకున్న విధానాలే కారణం. 

కొన్ని వందల సంవత్సరాలు ఉక్రెయిన్​ వేరే దేశాల పాలనలోనే మగ్గిపోయింది. చివరకు 1922లో సోవియట్‌‌ యూనియన్ ఏర్పడినప్పుడు అందులో చేరింది. దాదాపు 70 ఏండ్ల పాటు సోవియట్‌‌ యూనియన్ నీడలోనే ఉంది. ఇది సోవియట్‌‌ యూనియన్‌‌లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది. దానికి కారణం.. ఆ దేశానికున్న సహజ సంపద. చివరకు 1991లో స్వతంత్రం తెచ్చుకుంది. కానీ.. ఉక్రెయిన్‌‌ పుట్టి ముప్పై రెండేళ్లు కూడా దాటకముందే ఇంతటి భయంకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్ స్వతంత్రం పొందినప్పటి నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజులు గడిచిన కొద్దీ రెండు దేశాల మధ్య పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. అదే టైంలో ఉక్రెయిన్‌‌ యూరప్‌‌లోని చాలా దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకుంది. తర్వాత ఐరోపా దేశాల అండకోసం నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. దాంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలే యుద్ధానికి దారి తీశాయి. ఈ యుద్ధానికి ముందు కూడా కొన్ని విషయాల్లో రష్యా ఉక్రెయిన్‌‌ని ఇబ్బంది పెట్టింది. అదే టైంలో దేశంలో రాజకీయ సంక్షోభాలను, అంతర్గత పోరాటాలను ఎదుర్కొంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా రష్యాలాంటి దేశాన్ని కూడా ఎదిరించి నిలబడేంత శక్తిని కూడగట్టుకుంది. అందుకు ఆ దేశంలో ఉన్న కొన్ని వనరులు, వాళ్లు ఎంచుకున్న విధానాలే కారణం. 

చెర్నోబిల్‌‌ 

1986 ఏప్రిల్ 26న ప్రపంచంలోనే పెద్ద న్యూక్లియర్‌‌‌‌ ప్రమాదం ఉక్రెయిన్‌‌లో జరిగింది. చెర్నోబిల్ న్యూక్లియర్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌లో 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు సేఫ్టీ టెస్ట్‌‌  చేస్తుంటే ఈ ప్రమాదం జరిగింది. పవర్‌‌‌‌ సప్లై ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు ఇంజినీర్లు ఈ ప్రయోగం చేశారు. అందులో భాగంగానే ప్లాంట్‌‌లోని నాలుగో నెంబరు రియాక్టర్‌‌లో కొన్ని సిస్టమ్స్‌‌కు కరెంట్ కట్‌‌ చేశారు. దాంతో రియాక్టర్‌‌కు కూలింగ్ వాటర్‌‌ను పంపే టర్బైన్లు స్లోగా పనిచేశాయి. కూలింగ్ వాటర్ తగ్గిపోయింది. రియాక్టర్‌‌‌‌లో ఆవిరి వల్ల పీడనం పెరిగి పేలిపోయింది. దాంతో రియాక్టర్ పైకప్పు ఎగిరిపోయింది. మంటలు చెలరేగాయి. ఆ మంటలు పది రోజులు ఉన్నాయి. రేడియేషన్‌‌ ఎఫెక్ట్ వల్ల 134 మంది ఇబ్బంది పడ్డారు. తర్వాత అందులో 47 మంది చనిపోయారు. చెర్నోబిల్ నుంచి వచ్చిన రేడియేషన్‌‌ ఎఫెక్ట్‌‌ ఉన్న పొగ గాల్లో కలిసి యూరప్ దేశాల్లో కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించింది. వెంటనే చెర్నోబిల్‌‌ నుంచి లక్షల మందిని తరలించారు. ఈ ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 కిలోమీటర్ల వరకు ఎవరూ వెళ్లకూడదని ఆర్డర్స్‌‌ ఇచ్చింది గవర్నమెంట్‌‌. దాదాపు నాలుగు వేలకు పైగా చ. కి.మీటర్ల మేర రేడియేషన్‌‌ జోన్‌‌గా ప్రకటించారు. ఆ భూమిలో వ్యవసాయం చేయొద్దని రూల్‌‌ పెట్టారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. చెర్నోబిల్‌‌ని టూరిజం ప్లేస్‌‌గా మార్చారు. కాకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండేందుకు పర్మిషన్‌‌ లేదు. 

బయటపడ్డం

పోయినేడాది డిసెంబర్ 9న హైదరాబాద్‌‌లోని కన్సల్టెన్సీ ద్వారా ఉక్రెయిన్‌‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లాను. వినిస్టియాలోని వినిస్ట మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌‌లో జాయినయ్యా. మొత్తం 6 సంవత్సరాల కోర్సు. దాదాపు అక్కడున్నవన్నీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలే. ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా తక్కువ. అందుకే ఇక్కడితో పోలిస్తే ఉక్రెయిన్‌‌లో ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్‌‌ పూర్తి చేయొచ్చనే ఉక్రెయిన్‌‌ వెళ్లాను. అక్కడ వాతావరణం కూడా బాగుంది. కాకపోతే కాస్త చలి ఎక్కువ. నేను వెళ్లినప్పుడు అక్కడ‌‌‌‌ –19డిగ్రీలు ఉంది. అక్కడ మామూలుగా 5 డిగ్రీలే ఉంటుంది. సమ్మర్‌‌‌‌లో మాత్రం 20 డిగ్రీల వరకు ఉంటుంది. ఉక్రెనియన్లు అందరూ ఫ్రెండ్లీ గానే ఉంటారు. యూనివర్సిటీలో ఇంగ్లీష్‌‌లోనే క్లాసులు చెప్తారు. స్టూడెంట్స్‌‌ ఉండేందుకు యూనివర్సిటీల్లో హాస్టల్స్ ఉంటాయి. నేను యూనివర్సిటీ హాస్టల్‌‌లోనే ఉండేవాడిని. హాస్టల్‌‌లో కూడా మంచిగా ఉండేది. హాస్టల్‌‌లో మనకు కావాల్సిన ఫుడ్‌‌ వండుకునే అవకాశం కూడా ఉంది. లేదంటే మెస్‌‌లో తినొచ్చు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు రూమ్‌‌మేట్స్‌‌తో కలిసి వండుకున్నా. 

యుద్ధం గురించి ముందే తెలుసు

మాకు యుద్ధం గురించి ముందే తెలిసింది. కాకపోతే చాలా ఏండ్ల నుంచి చాలా సార్లు ఇలాంటి పుకార్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా సద్దుమణిగేవి. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. అమ్మానాన్నలు తిరిగి వచ్చేయమని చెప్పేసరికి ఫిబ్రవరి22న 74,000 రూపాయలతో 25న హైదరాబాద్‌‌ వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసున్నా. కానీ 24న యుద్ధం మొదలైంది. దాంతో ఫ్లైట్స్‌‌ క్యాన్సిల్‌‌ చేశారు. ఆ తర్వాత ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ రుమేనియా నుంచి ఇండియన్‌‌ స్టూడెంట్స్‌‌ని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసిందని తెలిసి 26న మా కాలేజ్ డీన్ ఇండియన్‌‌ స్టూడెంట్స్‌‌ కోసం బస్‌‌లను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్‌‌తో  కలిసి రాత్రంతా జర్నీ చేసి బోర్డర్‌‌‌‌ వరకు వచ్చా. కానీ.. ఇంకో నాలుగు కిలోమీటర్లు వెళ్తే రుమేనియాకు చేరుతాం అనుకునేలోపే బాగా ట్రాఫిక్‌‌ జామ్‌‌ అయింది. దాంతో అక్కడే బస్‌‌ దిగి నడుచుకుంటూ రుమేనియాకు చేరుకున్నాం. రుమేనియా బోర్డర్‌‌‌‌లో రోజున్నర ఉన్నాం. తర్వాత వాళ్ళు లోపలికి పంపారు. తర్వాత ఇమిగ్రేషన్ పూర్తి కాగానే ఇండియన్ ఎంబసీ వాళ్ళు మమ్మల్ని షెల్టర్‌‌‌‌లోకి తీసుకెళ్లారు. తెల్లారి అక్కడి నుంచి రుమేనియా రాజధానిలోని మరో షెల్టర్‌‌‌‌కి పంపారు. ఆ మరుసటి రోజు సి–17 మిలటరీ విమానంలో రుమేనియా రాజధాని నుంచి ఢిల్లీకి బయలుదేరి మరుసటిరోజు ఉదయం చేరుకున్నాం. ఆ రోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఉన్నాం. తర్వాత రోజు హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ ఇచ్చారు. అలా చివరకు హైదరాబాద్‌‌కు చేరుకున్నాం. ఉక్రెయిన్‌‌లో మేము ఉండే ప్రాంతం నుంచి రుమేనియా బోర్డర్ వరకు రావడానికి అయిన ఖర్చు  మాత్రమే మేం పెట్టుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ ఇన్‌‌సెక్యూర్ ఫీలింగ్ కలగలేదు. మామూలు పరిస్థితులు వస్తే స్టడీస్‌‌ కోసం మళ్లీ ఉక్రెయిన్‌‌ వెళ్లాలి అనుకుంటున్నాం. అక్కడి పరిస్థితులను టీవీల్లో చూస్తుంటే ఇప్పట్లో అక్కడికి వెళ్లడం సాధ్యమయ్యేలా అనిపించడం లేదు.
– నాసీర్ హుస్సేన్, ఖాజిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా

వారం రోజులు ఇబ్బంది 

నేను రెండేళ్ల కింద ఉక్రెయిన్‌‌లోని విన్నిసెటాలోని యూనివర్సిటీలో మెడిసిన్  చదవడానికి వెళ్లా. నేను వెళ్లినపుడు అక్కడ వాతావరణం చాలా బాగుంది. మమ్మల్ని వేరే దేశం నుంచి వచ్చినమన్నట్లు చూడకపోతుండె. అందరూ మాతో కలిసిమెలిసి ఉండేది. హెల్ప్‌‌ చేసేవాళ్లు. యుద్ధం కన్నా ముందు  ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇక్కడితో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బెటర్ గానే ఉంటుంది. పైగా ఇండియాతో పోలిస్తే ఉక్రెయిన్‌‌లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ. ఫీజులు కూడా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉంటాయి. అందుకే చదువు కోసం అక్కడికి వెళ్లా. యుద్ధం జరుగుతుందని మాకు రెండు వారాల ముందే తెలిసింది. కానీ.. మా ప్రొఫెసర్లు, యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ లైన్‌‌లో క్లాస్‌‌లు జరుగుతాయని చెప్పడంతో క్లాస్‌‌లు మిస్ కాకూడదని అక్కడే ఉండిపోయాం. అన్నీ సవ్యంగా ఉంటే ఫిబ్రవరి 26న ఇండియాకు వచ్చేవాళ్లం. కానీ 24న యుద్ధం స్టార్ట్ అయింది. దాంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రోజూ సైరన్ మోతలు వినిపిస్తుండటంతో భయం భయంగా ఉండేది. సైరన్ మోగినప్పుడల్లా హాస్టల్‌‌ బిల్డింగ్‌‌ గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో ఉన్న బంకర్‌‌‌‌లోకి బ్యాగ్‌‌లు, ఫైల్స్, ఫుడ్, వాటర్ తీసుకుని వెళ్లేవాళ్లం. ఇలా రోజులో మూడు,  నాలుగు సార్లు జరిగేది. నాలుగు రాత్రులు బంకర్లలోనే ఉన్నాం. ఫుడ్, నీళ్లకు ఇబ్బంది అయింది. ఏటీఎంలలో డబ్బులు సరిగా దొరికేవి కావు. 25నాడు రాత్రి సుమారు ఎనిమిది గంటలు బస్‌‌లో జర్నీ చేసి రుమేనియా బార్డర్‌‌‌‌కు వచ్చాం. కానీ.. రుమేనియాలోకి ఎంటర్ కావడానికి దాదాపు 12 కిలోమీటర్లు చలిలో  నడవాల్సి వచ్చింది. పైగా బార్డర్ దాటడానికి సుమారు ఎనిమిది గంటలు లైన్లలోనే నిలబడాల్సి వచ్చింది. మధ్యమధ్యలో తోపులాటలు. బార్డర్ దాటిన తర్వాత కూడా వెంటనే మమ్మల్ని ఎయిర్ పోర్ట్‌‌కు పంపలేదు. అక్కడే ఓ చిన్న గ్రామంలోని స్టేడియంలో షెల్టర్ జోన్‌‌ ఏర్పాటు చేసి ఉంచారు. అక్కడి వాళ్లు మా బాధలు చూడలేక రగ్గులు, టవళ్లు, పండ్లు ఇచ్చారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడుకోవడానికి సిమ్‌‌ కార్డులు కూడా ఇచ్చారు. మేము ఉక్రెయిన్‌‌లో స్టార్ట్‌‌ అయినప్పటి నుంచి ఇంటికి చేరేసరికి వారం రోజులు పట్టింది. ఆ వారంలో కడుపు నిండా తిన్నదంటే ఫ్లైట్‌‌లోనే.  పరిస్థితులు మంచిగైతే పోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నం. ఇక్కడే సీటు ఇస్తే అక్కడికి వెళ్లం. ఉక్రెయిన్‌‌లో ఏ ఒక్కరోజు కూడా మాకు ఇన్ సెక్యూర్ ఫీలింగ్ రాలేదు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా సేఫ్టీ ఉంటుంది. 
– గొట్టం శిరీషరెడ్డి, కరీంనగర్

మోసపోయిందా? 

ఉక్రెయిన్‌‌ స్వతంత్ర దేశంగా మారినప్పుడు  దాని శక్తి అంతా ఇంతా కాదు. అప్పట్లో ప్రపంచాన్నే వణికించేంత న్యూక్లియర్‌‌‌‌ పవర్ ఉక్రెయిన్ దగ్గర ఉంది. అయితే... అది ఉక్రెయిన్‌‌ గొప్పతనం కాదు. సోవియట్​ యూనియన్‌‌లో భాగంగా ఉన్నప్పుడు ఈ అణు ఆయుధాలన్నీ ఉక్రెయిన్‌‌లో నిల్వ చేసేవారు.  1991లో స్వాతంత్ర్యం వచ్చిన ప్పుడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉక్రెయిన్‌‌కు చెందిన 7,50,000 మంది సోల్జర్స్‌‌ ఉన్నారు. అంతేకాకుండా సోవియట్‌‌ యూనియన్‌‌ నుంచి విడిపోయినా దాదాపు ఐదువేలకు పైగా స్ట్రాటజిక్‌‌, టాక్టికల్‌‌ న్యూక్లియర్‌‌‌‌ వెపన్స్‌‌, బాంబులు ఉక్రెయిన్‌‌లోనే ఉండిపోయాయి. 1991లో నాలుగు రాకెట్‌‌ డివిజన్లు ఉండేవి. 175 ఖండాంతర క్షిపణులు, 33 హెవీ బాంబర్లు, ఎస్‌‌ఎస్‌‌24 క్షిపణులు సోవియట్‌‌ యూనియన్‌‌ ఉక్రెయిన్‌‌కు ఇచ్చింది. కానీ.. స్వతంత్రం వచ్చిన తర్వాత న్యూక్లియర్ ఆయుధాలన్నీ రష్యాకు ఇచ్చేయాలని, వాటిని ధ్వంసం చేసేస్తారని బ్రిటన్‌‌, రష్యా, అమెరికా చెప్పాయి. దాంతో 1994 డిసెంబరు 5న హంగేరి రాజధాని బుడాపెస్ట్‌‌లో ఒప్పందంపై సంతకం పెట్టింది ఉక్రెయిన్‌‌. తర్వాత 1996 నాటికి ఉక్రెయిన్ దగ్గరున్న చివరి న్యూక్లియర్ వెపన్‌‌ను కూడా రష్యాకు ఇచ్చేసింది. 

చాలా రెస్పెక్ట్‌‌ ఇస్తారు 

ఐదేండ్ల కింద ఉక్రెయిన్‍ వెళ్లా. ఒడెస్సా నేషనల్‍ మెడికల్‍ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌‌ ఫైనల్‍ ఇయర్‍ చదువుతున్నా. మరో రెండు మూడు నెలలైతే.. కోర్స్‌‌ కూడా పూర్తయ్యేది. ఇంతలోనే రష్యా –ఉక్రెయిన్‍ యుద్ధం మొదలైంది. ఇండియా నుంచి దాదాపు 20 వేల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్‌‌లో చదువుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‍ దొరకడంతోపాటు ఇండియాతో పోలిస్తే.. ఖర్చు చాలా తక్కువ. అందుకే వెళ్లాం. మాతో పాటు జపాన్‍, నైజీరియాకు చెందిన స్టూడెంట్స్‌‌ కూడా ఎక్కువగా ఉండేవాళ్లు. ఉక్రెయిన్‌‌ వాళ్లు ఏ ఒక్కరోజు మమ్మల్ని పరాయి దేశానికి చెందినవాళ్లలా చూడలేదు. చాలా బాగా చూసుకునేవాళ్లు. వాళ్లతో ఉంటే సొంతవాళ్లతో ఉన్నట్లే అనిపిస్తుంది. విదేశీ స్టూడెంట్లకు వాళ్లు చాలా రెస్పెక్ట్‌‌ ఇస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఉక్రెయిన్‍లో ఉన్నా.. ఇండియాలో ఉన్నట్లే ఫీల్‍ అయ్యేవాళ్లం. 

ఫిబ్రవరి 15 తర్వాతే టెన్షన్‍ 

ఫిబ్రవరి 10 కంటే ముందు.. రష్యా, ఉక్రెయిన్‍ దేశాల మధ్య ఏదో జరుగుతుంది అనేది కొంత డిస్కషన్‍ నడిచింది తప్పితే.. యుద్ధం జరుగుతుందని ఊహించలేదు. కొంత కర్ఫ్యూ ఉండే అవకాశముందని చెప్పారు. అవసరమున్న ఫుడ్‍, వస్తువులు కొనుక్కోవాలని చెప్పారు. తీరా చూస్తే నాలుగు రోజుల్లోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అధికారులు అలర్ట్‌‌ చేశారు. పదిహేనో తేదీన అక్కడి గవర్నమెంట్‍తో పాటు ఇండియన్‍ ఎంబసీ నుంచి ‘‘జాగ్రత్తగా ఉండాల’’ని మెసేజ్‍లు వచ్చాయి. సైరన్‍ మోగితే.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని అలర్ట్‌‌ చేశారు. దాంతో సైరన్‌‌ వచ్చినప్పుడల్లా బంకర్స్‌‌లో తల దాచుకున్నాం. చాలాచోట్ల బంకర్స్‌‌ ఉండడంతో వాటికి సంబంధించిన మ్యాప్స్‌‌ని పంపించారు. బంకర్స్‌‌లో రెస్ట్‌‌ తీసుకోడానికి కుర్చీలు, వాటర్‍ ఫెసిలిటీ, వాష్‍రూంలు అందుబాటులో ఉన్నాయి. అపార్ట్‌‌మెంట్లలో బంకర్స్‌‌ ఉండవు. అలాంటివాళ్లు గ్రౌండ్‍ ఫ్లోర్‍లో ఉండాలని చెప్పారు. 

ధరలు పెరిగాయి

ఫిబ్రవరి 19 వచ్చేసరికి తిండికి ఇబ్బందులు మొదలయ్యాయి. ట్రాన్స్‌‌పోర్ట్‌‌ లేకపోవడంతో ఉన్న వస్తువులకే రెండు, మూడింతల ధర పెట్టాల్సి వచ్చింది. మేం రెండు నెలలకు సరిపోయే రైస్, ఇతర వస్తువులు కొన్నాం. 

యుద్ధం మొదలయ్యాక 

యుద్ధానికి ముందు లోకల్‍ జనాలతో పాటు వివిధ దేశాల నుంచి అక్కడకు వెళ్లిన మాలాంటి వాళ్లంతా పెద్దగా భయపడలేదు. ఎప్పుడైతే వార్‍ మొదలైందో ఇక టెన్షన్‍ మొదలైంది. మాకు దగ్గర్లో బాంబుల దాడి సౌండ్స్‌‌తో కలవరం మొదలైంది. మొదట్లో బార్డర్‍ దగ్గర జరిగిన యుద్ధం ఆపై సిటీ వరకు రావడంతో.. ఇక సొంత దేశాలకు వెళ్లాలనే ఆలోచన మొదలైంది. ఆ పరిస్థితుల్లో ఎలా వెళ్లాలో తెలియక భయం పట్టుకుంది. యుద్ధం స్టార్ట్‌‌ అయ్యాక మొదట్లో కొందరు స్టూడెంట్స్‌‌ అక్కడి కాంట్రాక్టర్ల హెల్ప్‌‌తో బస్సులు మాట్లాడుకుని రైల్వే స్టేషన్‍ వరకు వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత కొందరు లోకల్‌‌ వాళ్లు మాకు హెల్ప్‌‌ చేయడానికి ముందుకొచ్చారు. ఒక ట్రైన్ ఏర్పాటు చేశారు. కానీ అదే టైంలో మా సిటీపై అటాక్‍ జరగడంతో మేం దాన్ని క్యాచ్‍ చేయలేకపోయాం. 

బార్డర్‌‌‌‌కు చేరే వరకు భయం పోలేదు 

యుద్ధం సిటీ వరకు రావడంతో మాతోపాటు ఉక్రెయిన్‌‌ వాళ్లు కూడా దగ్గర్లో ఉండే పక్క దేశాలకు వెళ్లాలనే ఆలోచనకు వచ్చారు. ట్రైన్‍ టికెట్‍ కోసం అందరూ ఆన్‍లైన్‍లో బుకింగ్‍ ట్రై చేయడంతో కొందరికే దొరికాయి. నాకైతే టికెట్‍ దొరికింది. భయంభయంగా ఒడెస్సా నుంచి లివీబ్‍, అక్కడి నుంచి బార్డర్‌‌‌‌లో ఉండే చాప్‍ వరకు వచ్చా. జర్నీ టైంలోనూ బాంబుల సౌండ్‍తో భయపడ్డాం. ఇండియన్‍ ఎంబసీతో కలిసి హంగేరి గవర్నమెంట్‍ ట్రైన్స్‌‌ ఏర్పాటు చేసింది. అలా బార్డర్‍ వరకు రాగలిగాం. 

ఇండియన్‍ గవర్నమెంట్‍.. రియల్లీ గ్రేట్‍ 

మేం ఇండియాకు తిరిగిరావడంలో ఇండియన్‍ గవర్నమెంట్‍ వ్యవహరించిన తీరు గ్రేట్‍ అని చెప్పాల్సిందే. ఇండియన్‍ ఎంబసీ ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పింది. బార్డర్‍, ఎయిర్‍పోర్ట్‌‌ దగ్గర హోటల్స్‌‌ బుక్‍ చేసి ఫుడ్‍ ఏర్పాటు చేశారు. సెంట్రల్‍ మినిష్టర్‍ కిషన్‍రెడ్డి రెగ్యులర్‍గా మాతో మాట్లాడారు. స్టూడెంట్స్‌‌ డిటెయిల్స్‌‌ తీసుకున్నారు. అంతే స్పీడ్‍తో ఏర్పాట్లు కూడా చేశారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి వచ్చేలా చూసుకున్నారు. వాళ్లకు థ్యాంక్స్‌‌ చెప్పకుండా ఉండలేం.

ఫ్యూచర్‍ ఏంటో..

కష్టకాలంలో ఇండియాకు రాగలిగామనే హ్యాపీ ఉంది. అదే టైంలో మా ఫ్యూచర్‍ ఏంటో తెలియట్లేదు. ఇంకో రెండు నెలల్లో మాకు ఫైనల్‍ ఎగ్జామ్స్‌‌ ఉండేవి. మా కోర్స్‌‌ అయిపోయేది. ఏడాది కింద కరోనా వల్ల ఇండియా రావాల్సి వచ్చింది. సెప్టెంబర్‌‌‌‌లో మళ్లీ వెళ్ళా. ఇప్పుడు ఇలా అయింది.  మేం చదివిన యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. మేమంటే ఎలానో వచ్చాం. ఇన్నాళ్లు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్న అక్కడి మా ఫ్రెండ్స్‌‌ ఎలా ఉన్నారో ఊహించుకుంటేనే ఏడుపొస్తోంది. 
- అంబాల లిఖిత్‍ రాహుల్‍, 
హనుమకొండ సిటీలోని దుర్గకాలనీ

భాషకు గుర్తింపు 

ఈ దేశంలో ఎక్కువమంది మాట్లాడేది ఉక్రెనియన్. రష్యన్‌‌ లాంగ్వేజ్‌‌కు దగ్గరిగా ఉంటుందీ భాష. ఉక్రెనియన్‌‌తోపాటు పోలిష్, యిడ్డిష్, రుసిన్, బెలారసియన్, రొమేనియన్, బల్గేరియన్, క్రిమియన్, హంగేరియన్ కూడా మాట్లాడతారు. రష్యన్‌‌ సామ్రాజ్య పాలనలో ఉన్నప్పుడు ఉక్రెనియన్‌‌ భాషకి పెద్దగా గుర్తింపు లేదు. కానీ.. 1917 రెవల్యూషన్‌‌ తర్వాత ఉక్రెనియన్‌‌కు రష్యన్‌‌తో సమాన హోదా దక్కింది. 1989లో ఉక్రెనియన్ అఫీషియల్‌‌ లాంగ్వేజ్‌‌గా గుర్తింపు పొందింది. 1996లో ఉక్రెనియన్ రాజ్యాంగంలో ఒకే ఒక అధికార భాషగా ఉక్రెనియన్‌‌ని గుర్తించారు. అయితే.. 2012లో మైనారిటీ భాషలకు కూడా అధికారిక హోదా ఇచ్చారు.

ఇంట్రెస్టింగ్‌‌ ఫ్యాక్ట్స్‌‌

  • పెద్ద దేశం: రష్యాను మినహాయిస్తే ఐరోపాలో ఉక్రెయిన్ అతిపెద్ద దేశం. తూర్పున రష్యా నుండి పశ్చిమాన పోలెండ్ వరకు ఉంది. దాని దక్షిణ సరిహద్దులో  బ్లాక్‌‌ సీ ఉంది. ఇది బ్రిటన్‌‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెద్దది. 
  • ఏడు యునెస్కో హెరిటేజ్‌‌ సైట్స్‌‌: యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్‌‌ సైట్ల లిస్ట్‌‌లో ఉక్రెయిన్‌‌లోని ఏడు ప్రదేశాలకు స్థానం దక్కింది. 
  • ప్రపంచంలోనే లోతైన మెట్రో స్టేషన్: ఉక్రెయిన్‌‌లోని ఆర్సెనల్నా మెట్రో స్టేషన్‌‌ ప్రపంచంలోనే ఎక్కువ లోతైనది. కీవ్ నుంచి స్వియాటోషిన్స్‌‌కో–-బ్రోవర్స్కా వెళ్లే మార్గంలో ఈ స్టేషన్‌‌ ఉంది. ఇది భూమికి 105.5 మీటర్ల లోతులో ఉంది. దీన్ని కోల్డ్‌‌ వార్‌‌‌‌ టైంలో కట్టారు. 
  • చికెన్ కీవ్.. కీవ్‌‌ది కాదు: ఉక్రెయిన్‌‌లో చాలామంది ఇష్టపడే వంటకం ‘చికెన్ కీవ్‌‌’. ఈ పేరు వినగానే ఇది కీవ్‌‌లో పుట్టిందని అనుకుంటారు. కానీ.. కీవ్‌‌లో కాదు కదా.. ఇది అసలు ఉక్రెయిన్‌‌ వంటకమే కాదు. కానీ.. ఇది ఉక్రెయిన్‌‌లో చాలా ఫేమస్‌‌. ఆ దేశానికి ఎవరు వెళ్లినా దీన్ని టేస్ట్‌‌ చేస్తారు. ఇది రష్యాలో పుట్టిందని కొందరు చెప్తుంటారు. మరికొందరు ఇది ఫ్రాన్స్‌‌ నుంచి వచ్చిందంటారు. 
  • యంగెస్ట్ కంట్రీ: ప్రపంచంలోని చాలా తక్కువ వయసున్న దేశాల్లో ఇది కూడా ఒకటి. 1991లో పుట్టింది.

సాకర్ ఇష్టం 

 ఉక్రెయిన్‌‌ స్పోర్ట్స్‌‌కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అక్కడ వందలాది స్టేడియాలు, స్విమ్మింగ్‌‌ ఫూల్స్‌‌, జిమ్‌‌లు, అథ్లెట్స్‌‌ కోసం ట్రైనింగ్‌‌ సెంటర్లు ఉన్నాయి. అథ్లెటిక్స్‌‌, వాలీబాల్, షూటింగ్, బాస్కెట్‌‌బాల్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్ ఇక్కడ బాగా ఫేమస్‌‌. వీళ్లకు సాకర్ చాలా ఇష్టమైన ఆట.  యుఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ కాలంలో కూడా ఉక్రేనియన్ అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 

ఏం తింటారంటే.. 

దేశంలో చైనీస్, గ్రీక్, కాంటినెంటల్ లాంటి ఫారిన్‌‌ ఫుడ్‌‌ని ఎక్కువగా ఇష్టపడతారు. పిజ్జా సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు కూడా చాలా ఉంటాయి. చాలా మంది ఉక్రేనియన్లు బోర్ష్ట్, క్యాబేజీ రోల్స్, స్టడీనెట్స్, షాష్లీకీ లాంటి సంప్రదాయ ఉక్రేనియన్ ఫుడ్‌‌ని ఇష్టపడతారు. చికెన్, పంది మాంసం, బీఫ్‌‌, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటితోపాటు ఆలుగడ్డలు, ధాన్యాలు, ఊరగాయలు ఎక్కువగా తింటారు. పండుగలప్పుడు వీటన్నింటితోపాటు ఓడ్కా కామన్‌‌గా ఉంటుంది. 

పరిస్థితులు కంట్రోల్లోకి వస్తే వెళ్తా

ఉక్రెయిన్‌‌లో మా బంధువులున్నరు. అందుకే అక్కడ మెడిసిన్ చదవనీకి పోయిన. నాతో పాటు పాలమూరుకు చెందిన నా దోస్తులు కూడా వచ్చిన్రు. 2018లో ఉక్రెయిన్‌‌లోని ఒడెస్సా యూనివర్సిటీలో చేరిన. ఆరేళ్లు కోర్సు ఇది. ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్ చదువుతున్న. ఉక్రెయిన్ వాళ్లు ఇండియన్స్‌‌ని మస్తు లైక్ చేస్తరు. అక్కడ నాకు దోస్తులు కూడా మస్తు మంది ఉన్నరు. ఇన్ సెక్యూరిటీగా ఎప్పుడూ ఫీల్ కాలే. ఫుడ్ మాత్రం మేమే వండుకుంటం. మార్కెట్‌‌కు పోయి  వెజిటబుల్స్ కొని తెచ్చుకుంటం. వెదర్ చాలా కూల్​గా ఉంటది. ఇంట్లో ఉన్నా జాకెట్స్ వేసుకోవాలె. రష్యా ఉక్రెయిన్‌‌పై వార్‌‌‌‌కు దిగేందుకు రెడీ అవుతున్నట్టు మాకు ముందే తెలిసింది. వెంటనే ఫిబ్రవరి 23న ఇండియాకు రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నం. మార్చి 10కి టికెట్ కన్ఫామ్‌‌ అయింది. తర్వాత రోజే రష్యా బాంబులు వేయడం మొదలుపెట్టింది. దాంతో అక్కడి గవర్నమెంట్ ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. యూనివర్సిటీ ఆఫీసర్లను కలిసినం. మమ్మల్ని ఇండియాకు పంపమని కొట్లాడినం. ఎలాగోలాగా ఇంటికి వచ్చినం. అక్కడ పరిస్థితులు కంట్రోల్లోకి వస్తే మళ్లీ పోత. యూనివర్సిటీ వాళ్లు మేసేజ్ పంపిన్రు. ఆన్‌‌లైన్‌‌లో క్లాస్‌‌లు ఉంటయని చెప్పిన్రు.
- కొమ్ము యోజిత, జడ్చర్ల

ఉక్రెయిన్‌‌లో ఎందుకు?

మనవాళ్లు వేల మంది చదువు కోసం ఉక్రెయిన్‌‌కు వెళ్లారు. వాళ్లలో ఎక్కువమంది మెడిసిన్‌‌ చదవడానికే వెళ్లారు. అసలు చదువుకోవడానికి ఉక్రెయిన్‌‌కే ఎందుకు వెళ్తున్నారంటే.. మన దేశంతో పోలిస్తే అక్కడ చదువుకయ్యే ఖర్చు చాలా తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ఆఫ్ ఉక్రెయిన్ ప్రకారం.. ఇతర దేశాల నుంచి వచ్చి 76,000 మంది చదువుకుంటున్నారు. వాళ్లలో 18,000 మందికి పైగా ఇండియన్‌‌ స్టూడెంట్స్‌‌ ఉన్నారు. మిగతావాళ్లు చైనా, ఈజిప్ట్, తుర్క్‌‌మెనిస్తాన్, అజర్‌‌బైజాన్, మొరాకో, నైజీరియా, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలవాళ్లు. మనవాళ్లు ఉక్రెయిన్‌‌ వెళ్లడానికి ముఖ్య కారణం ఫీజులు.  మన దగ్గర ప్రైవేట్‌‌ కాలేజీల్లో ఎంబీబీఎస్ చదవాలంటే 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే ఉక్రెయిన్‌‌లో అయితే.. ఫస్ట్‌‌ ఇయర్‌‌‌‌ 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి 5 నుంచి 6 లక్షల రూపాయల ఖర్చు. అందుకే ఉక్రెయిన్‌‌లో చదువుకోవడానికి ఎక్కువమంది వెళ్తుంటారు. 

::: ‌‌‌‌కరుణాకర్​ మానెగాళ్ల
::: వెలుగు నెట్​వర్క్​