తల్లిదండ్రులు ఇద్దరూ IAS అధికారులు.. మీకు రిజర్వేషన్ ఎందుకు..? : సుప్రీంకోర్టు

తల్లిదండ్రులు ఇద్దరూ IAS అధికారులు.. మీకు రిజర్వేషన్ ఎందుకు..? : సుప్రీంకోర్టు

రిజర్వేషన్లపై సమాజంలో చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రిజర్వేషన్లను ఉపయోగించుకుని లబ్ది పొందిన కుటుంబాలకు మళ్లీ రిజర్వేషన్లు కావాలనుకోవడం ఎంత వరకు సమంజసమని.. 2026 మే 22న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

వెనకబడిన తరగతులలో క్రిమీ లేయర్ లో ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు.. అనే అంశంపై వాదనల సందర్భంగా.. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పటికీ.. వాళ్ల పిల్లలకు రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనా అని ప్రశ్నించింది. పేరెంట్స్ ఇద్దరూ IAS అధికారులు అయినప్పుడు ఎందుకు రిజర్వేషన్ కోరుకుంటున్నారు.? అంటూ ప్రశ్నించింది. ఆర్థిక, విద్యా పరమైన అభివృద్ధి సమాజిక వ్యవస్థలో మార్పు వస్తుందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 

విద్య, ఆర్థిక ప్రగతి.. సామాజికంగా ముందు వరుసలో ఉండేలా చేస్తాయి. మళ్లీ రిజర్వేషన్లు తీసుకుంటే.. ఆ సామాజిక చట్రం నుంచి బయటకు పడలేమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది ఆందోళన కలిగించే అశంగా కోర్టు పేర్కొంది. రిజర్వేషన్ల ద్వార లబ్దిపొందిన సెక్షన్స్ ను మినహాయించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ఆర్డర్స్ ఇచ్చాయని.. కానీ వాటిని సవాలు చేసే పరిస్థితి వస్తోందని కోర్టు తెలిపింది. 

సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ కావాల్సిందేనని పదేపదే డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది. పిల్లల తల్లిదండ్రులకు మంచి జాబ్ ఉంటుంది. మంచి జీతం వస్తుంది. మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కావాలంటారు. వారు రిజర్వేషన్ నుంచి బయటపడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది కోర్టు. 

రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు.. ఒక దశ వరకు విద్య, ఆర్థిక పురోగతి సాధించిన కుటుంబాలకు.. వారి తర్వాత తరాలు రిజర్వేషన్లు పొందాలా వద్దా అనే అంశంపై.. అర్హతపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆర్థిక పురోగతి పొందిన కుటుంబాలు.. సామాజికంగా ముందు వరుసలో ఉన్న కుటుంబాలు కూడా రిజర్వేషన్లు కావాలంటే ఇక క్రిమీ లేయర్ కు అర్థమే ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది కోర్టు.