
బెంగుళూర్: హిందూ మతం, మతమార్పిడిలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారుతారు..? అని ప్రశ్నించారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే మతమార్పిడి జరిగేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే మరీ అంటరానితనం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
ఇస్లాం, క్రైస్తవం ఇతర ఏ మతంలోనైనా అసమానతలు ఉంటాయని.. అంటరానితనాన్ని మనమే సృష్టించామా..? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఇతర ఏ పార్టీలు కూడా మతం మారమని ప్రజలకు చెప్పలేదని.. కానీ ప్రజలు తమ నమ్మకాలకు అనుగుణంగా మతం మారుతారని.. అది వారి హక్కు అని అన్నారు.
హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ పాలిటిక్స్‌లో కాకరేపాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడికి దిగింది. కర్నాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక, చలవాడి నారాయణస్వామి వంటి ప్రతిపక్ష నాయకులు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.
►ALSO READ | లష్కరే క్యాంప్ పునరుద్ధరిస్తున్న పాక్.. వరద సాయం పేరుతో కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం..
ముస్లింల మెప్పు కోసం సిద్ధరామయ్య హిందు మతంలో చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను టార్గెట్ చేసుకుని కులం, మతం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యింది. సమానత్వం గురించి చర్చ వస్తే సీఎం సిద్ధరామయ్యకు మొదట హిందూ మతమే గుర్తుస్తోంది.
మరీ సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం ఉందా అని సీఎం సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత అశోక. పహల్గామ్ ఉగ్రవాద దాడి, మసీదులలో మహిళలపై ఆంక్షలు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి వ్యతిరేకత, ముస్లిమేతరులకు ఖురాన్ వంటి ఇస్తాంలోని మత ఆచారాలను గుర్తు చేసి.. వీటిని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించగలరా అని సవాల్ విసిరారు.