విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ? ఒక ఫ్రెండ్గా స్టాలిన్ ను కలిశా..రజినీకాంత్

విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ? ఒక ఫ్రెండ్గా స్టాలిన్ ను కలిశా..రజినీకాంత్

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్​తో తాను భేటీకావడంపై సూపర్ స్టార్  రజినీకాంత్  క్లారిటీ ఇచ్చారు. ఒక ఫ్రెండ్​గా స్టాలిన్ ను కలిశానని ఆయన చెప్పారు. ఆదివారం చెన్నైలో పోయెస్ గార్డెన్​లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. స్టాలిన్​ను తాను కలిసినప్పటి నుంచి అనేక వదంతులు, విమర్శలు వస్తున్నాయని చెప్పారు.

విజయ్  సీఎం కావడంతో తాను అసూయ పడుతున్నట్లు పుకార్లు వచ్చాయని, అవన్నీ అర్థంలేని వార్తలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రెస్ కాన్ఫరెన్స్  పెట్టానని, ఇప్పటికీ ఆ పుకార్లపై స్పందించకపోతే వాటిని జనం నిజమని భావిస్తారేమోనని తెలిపారు. ఒకవేళ, విజయ్​ కాకుం డా కమల్ హాసన్  సీఎం అయుంటే కచ్చితంగా అసూయపడేవాడినని సరదాగా అన్నారు.