వేధింపులు భరించలేక భర్త ప్రాణాలు తీసిన భార్య.. కరీంనగర్ జిల్లాలో ఘటన

వేధింపులు భరించలేక భర్త ప్రాణాలు తీసిన భార్య.. కరీంనగర్ జిల్లాలో ఘటన

మానకొండూర్/ శంకరపట్నం, వెలుగు: నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న భర్తను భార్య, కుమారుడితో కలిసి హత్య చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో చోటుచేసుకుంది. దాడి అనంతరం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వెళ్లి లొంగిపోయింది. మానకొండూర్ సీఐ పి.శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టప్పా రమేశ్​(42)కు సుమలతతో 2006లో వివాహమైంది. 

వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రమేశ్ నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ పడగా అవేశానికి గురైన భార్య సుమలత, కొడుకు నిఖిల్ అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన రమేశ్​స్పాట్​లోనే మృతి చెందాడు. అనంతరం సుమలత, ఆమె కొడుకు పీఎస్​లో లొంగిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా చేసి, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.