జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దారుణం..కుటుంబ గొడవలతో భర్తను చంపిన భార్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దారుణం..కుటుంబ గొడవలతో భర్తను చంపిన భార్య

మల్లాపూర్, వెలుగు :- కుటుంబ గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య (55), పల్లికొండ రాజు భార్యాభర్తలు. వీరికి రెండు ఎకరాల భూమి ఉండగా.. సాగు విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో బుధవారం కూడా గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన భార్య రాజు.. పదునైన ఆయుధంతో భర్త మల్లయ్య గొంతు కోసి హత్య చేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు తెస్తున్నట్లు పోలీసులు తెలిపారు.