కరోనాతో భర్త మృతి.. బాధతో భార్య సూసైడ్

V6 Velugu Posted on Jun 12, 2021

    అనాథలైన ఇద్దరు ఆడ పిల్లలు

జవహర్​నగర్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ ​చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని జవహర్ నగర్​ పోలీస్​ స్టేషన్​పరిధిలో జరిగింది. దమ్మాయిగూడ ద్వారకాపురిలోని స్ఫూర్తి ఎన్​క్లేవ్​లో ఉండే సుబ్రహ్మణ్యం, అరుణ హర్షిత(35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుబ్రహ్మణ్యం క్యాటరింగ్​పని చేస్తుంటాడు. ఇటీవల కరోనా సోకింది. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అరుణహర్షిత బాధపడుతూ ఉంది. పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు పడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్​ చేసుకుంది. శుక్రవారం ఉదయం గమనించిన అత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి డెడ్​బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్​కి తరలించారు. మృతురాలికి బంధువులు ఎవరూ లేకపోవడం, అత్తకు కరోనా ఉండడంతో ఉస్మానియాలోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులే అంత్యక్రియలు నిర్వహించారు. 

కరోనాతో కొడుకు.. గుండెపోటుతో తల్లి

ములకలపల్లి: కరోనాతో చికిత్స పొందుతున్న కొడుకు చనిపోయాడని తెలిసిన కొద్దిసేపటికే ఇంటి వద్ద ఉన్న తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(75) కొడుకు కళ్యాణ్​రావు(45). 16 రోజుల క్రితం కళ్యాణ్​కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్​అని తేలింది. ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మమ్మ గుండెపోటుతో చనిపోయింది. 

Tagged Wife, suicide, death, covid dead husband, Jawahar Nagar Hyderabad

Latest Videos

Subscribe Now

More News