భార్య చేతిలో భర్త హత్య

భార్య చేతిలో భర్త హత్య

దుబాయ్‌‌ నుంచి వచ్చిన ప్రతిసారి గొడవ పడుతున్నాడని భర్తను రోకలి బండతో తలపై కొట్టి హత్యచేసిందో భార్య. నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నాయిడి గంగారాం(50), నాయిడి సాయవ్వ దంపతులకు ముగ్గురు పిల్లల్లు, వారందరికి  పెళ్లీలు అయ్యాయి. గంగారాం దుబాయి వెళ్లి కొద్ది రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. ఆదివారం మద్యంతాగి ఇంటికి వచ్చాడు ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా గంగారాం మృతదేహం రక్తపుమడుగులో పడి ఉంది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి విచారించగా భర్తను తనే చంపినట్లుగా భార్య సాయవ్వ ఒప్పుకుంది.