భార్య హత్యకేసులో భర్త అరెస్ట్

భార్య హత్యకేసులో భర్త అరెస్ట్

హైదరాబాద్ వెలుగు: భార్యను హత్య చేసిన కేసులో భర్తను రిమాండుకు తరలించిన ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ కు చెందిన అబ్దుల్ గని ఆటో డ్రైవర్. అబ్దుల్ గనికి అమెది అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. డబ్బులు సరిపోక అబ్దు ల్ ఆటో నడపడం మానేసి హోటల్ నిర్వహించాడు. అక్కడ పనిచేయడానికి వచ్చిన పర్జానా అనే యువతిని తనకు పెళ్లి అయ్యిందని చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకు అతని ప్రవర్తనలో మార్పురావడంతో అనుమానం వచ్చి ఫర్జానా అబ్దుల్ ను నిలదీసింది. అప్పటి నుంచి వారికి తరుచూ గొడవలు జరిగాయి. దీంతో ఫర్జానాను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 15న పథకం ప్రకారం ఫర్జానాతో గొడవకు దిగాడు. గొంతు నుమిలి హత్య చేశాడు.

ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం బాత్రూంలో కాలుజారి పడిపోయిందని నమ్మబలికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు నమ్మించాడు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారన్నారు. తన కూతురు చావుకు అబ్దుల్ గని, అతని తల్లిదండ్రులే కారణమని ఫర్జానా కుటుంబ సభ్యులు కేసుపెట్టారు. దర్యాప్తులో అబ్దుల్ గనీ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అబ్దుల్, అతని తండ్రి సబీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు.