
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, వెలుగు: భర్త రోజూ మద్యం తాగి వస్తున్నాడనే కోపంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ బాబానగర్ కాలనీకి చెందిన చింతకుంట రాములు(55), తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాములు రోజూ మద్యం తాగి వస్తున్నాడని తిరుపతమ్మ గొడవ పడుతుండేది.
ఈనెల 5న కూలి పనికి వెళ్లి వచ్చిన రాములు ఇంటి వద్ద ఓ షాపు ముందు కూర్చొని ఉండగా తిరుపతమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించింది. గాయపడిన అతడిని స్థానికులు108లో మహబూబ్నగర్ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మృతుడి తమ్ముడు యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.