హెడ్​కానిస్టేబుల్ ని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య

హెడ్​కానిస్టేబుల్ ని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేసి మరో యువతితో సహజీవనం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్​ను భార్యే ర్యెడ్​హాండెడ్​గా పట్టుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన గడ్డం రాజేశ్ చాతకొండ ఆరో బెటాలియన్​లో హెడ్​కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 2011లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెండ్లయిన ఆరేండ్లకు వారికి పాప పుట్టింది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రాజేశ్​తరచూ స్వప్నను కొడుతూ చివరకు ఇంటి నుంచి గెంటేశాడు. ఆ టైంలో స్వప్న భర్తపై పోలీస్​కంప్లైంట్ ఇచ్చింది. ఈ క్రమంలో మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజేశ్ భార్యను పట్టించుకోవడం మానేశాడు. పాల్వంచలోని బోల్లోరి గూడెంలో యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న, ఆమె కుటుంబ సభ్యులు గురువారం యువతి ఇంట్లో రాజేశ్​ను ర్యెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆగ్రహంతో స్వప్న భర్తను  కొట్టబోతుండగా అడ్డుకుని తిరిగి ఆమెపై దాడి చేశాడు. అంతలోకి మహిళా సంఘాల నాయకులు చేరుకుని రాజేశ్​కు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు న్యాయం చేయాలని స్వప్న పోలీసులను, మహిళా సంఘాల నాయకులను వేడుకుంది.