
నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ అధికారుల నిర్లక్ష్యంతో జంతువులు చనిపోతున్నాయి. వేసవిలో సాసర్ పిట్ లు ఏర్పాటు చేయకపోవడంతో నీళ్ల కోసం గ్రామాల్లోకి వెళ్లి మృత్యువాత పడుతున్నాయి. బిజినపల్లి మండలం గంగారం పరిధిలో.. ఈ మధ్య కాలంలో చాలా జంతువులు చనిపోయాయి. దీంతో అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. మూగజీవుల దాహార్తి గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. అధికారులు మాత్రం సాసర్ పిట్ లు, కుంటల్లో ప్రత్యేకంగా నీటిని నింపుతున్నట్టు చెప్పారు.