కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్పల్లి అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీపై అడవి పంది దాడి చేసింది. గ్రామానికి చెందిన చింతల అంశమ్మ రోజు మాదిరిగానే మంగళవారం ఉపాధి పనులకు వెళ్లింది. ఈక్రమంలో అకస్మాత్తుగా ఆడవి పంది వచ్చి ఆమెపై దాడి చేయడంతో చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం కౌడిపల్లి ప్రభుత్వఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
