
అనుష్క సినిమాలకు దూరం కానుందా..? ఫిల్మ్నగర్లో ఇప్పుడు వినిపిస్తోన్న కొత్త రూమర్ ఇది. ‘జాతిరత్నాలు’ హీరోతో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో స్వీటీ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది దాదాపుపూర్తి కావొస్తున్నా... మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ సినిమాలకు ఎప్పుడో దూరమైన ఈ బ్యూటీ.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు వాటిని కూడా తగ్గించే పనిలో ఉందట.
తన దగ్గరకు వచ్చిన కథలను వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదట అనుష్క. ఇప్పుడు రానున్న సినిమా కూడా ప్రభాస్హోం బ్యానర్కావడంతోనే చేస్తుందంటున్నారు. కొంతకాలంగా అనుష్కకు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అందుకే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందనే ప్రచారం నడుస్తోంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ బ్రేక్ తాత్కాలికమేనని అంటున్నారు.