ఇదెక్కడి పంచాయితీ బిగ్ బాస్.. లోపల గొడవ.. బయటికి వచ్చాక విడాకులు?

ఇదెక్కడి పంచాయితీ బిగ్ బాస్.. లోపల గొడవ.. బయటికి వచ్చాక విడాకులు?

బిగ్ బాస్ షోకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అడుగుపెట్టిన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది ఈ షో. ఎక్కడో నెదర్లాండ్స్ లో పుట్టిన ఈ షో ప్రస్తుతం ఇండియాలో కూడా ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఈ షోను ఇష్టపడేవాళ్లు ఎంతమంది ఉన్నారు.. ద్వేషించేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. దానికి చాలా కారణాలే ఉన్నాయి.  

తాజాగా అలాంటి సంఘటనే హిందీ బిగ్ బాస్ లో జరిగింది. ప్రస్తుతం హిందీలో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో జంటగా అడుగుపెట్టారు ప్రముఖ బాలీవుడ్‌ కపుల్‌ అంఖిత లోఖండే.. విక్కీ జైన్‌. లోపలి వెళ్లిన కొన్నిరోజుల వరకు బాగానే ఉన్న ఈ జంట మధ్య అనుకోకుండా గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రోమో ఈ గొడవలు కాస్త నెక్స్ట్ లెవల్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఆ ప్రోమో చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.. పచ్చగా ఉన్న కాపురంలో బిగ్ బాస్ నిప్పులు పోస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఈ గొడవల కారణంగా.. బయటకు వచ్చాక ఈ జంట విడాకులు తీసుకోనున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమేనా? లేక ప్రచారమా అనేది తెలియాలంటే మాత్రం ఈ జంట స్పందించే వరకు ఆగాల్సిందే. 

 ALSO READ : ఎలిమినేషన్ భయంలో రతికా.. ఎంత ఓవర్ యాక్షన్ చేసినా వర్కౌట్ అవలేదు