Ipl-2026:మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ను చెన్నై వదులుకుంటుందా..? ఐపీఎల్ వేలం ముందు ఫ్యాన్స్లో ఆందోళన

Ipl-2026:మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ను చెన్నై వదులుకుంటుందా..? ఐపీఎల్ వేలం ముందు ఫ్యాన్స్లో ఆందోళన

ఐపీఎల్ -2026 కు సన్నాహకాలు  మొదలయ్యాయి. త్వరలోనే వేలం నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. టీమ్ నుంచి దాదాపు ఐదుగురు ప్లేయర్లను వదులుకోనున్నట్లు సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. అందులో మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ ఉండటంపై ఫ్యాన్స్ షాకింగ్ లో ఉన్నారు. 

క్రిక్ బజ్ (Cricbuzz) రిపోర్ట్ ప్రకారం 5 మంది ప్లేయర్లను వచ్చే సెషన్ లో చెన్నై వదులుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో సామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే పేర్లు డిస్కషన్ లోకి వచ్చాయి. ఈ లిస్టుపై ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. సామ్ కరణ్, కాన్వే వంటి మ్యాచ్ విన్నింగ్ స్టార్స్ ను వదులుకోవాల్సిన అవసరమేంటని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. 

ఈ గందరగోళంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పందించింది. ఈ రూమర్స్ కు చెక్ పెట్టేందుకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. డోంట్ వర్రీ.. ఆ మ్యాటర్ గురించి అప్ డేట్ చేస్తామని పోస్ట్ చేసింది. ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదని.. కేవలం బయో అప్డేట్ చేసినట్లు సీఎస్కే పోస్ట్ చేసింది. దీంతో ఫాన్స్ కాస్త కూలయ్యారు. 

లాస్ట్ సెషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఫామ్ నుంచి బయటికి వచ్చేందుకు నెక్స్ట్ సెషన్ కోసం సన్నద్ధం అవుతోంది. అందుకోసం భారీ మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. గత సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన CSK కేవలం 4 మ్యాచ్ లు గెలవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశలకు గురిచేసింది. దీంతో వచ్చే ఆక్షన్ కోసం రిటెన్షన్ లిస్టు రెడీ చేయాల్సి ఉంది. నవంబర్ 15 లోపు రిటెన్షన్ లిస్టు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఏ అప్ డేట్ ఉన్నా షేర్ చేయనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది.