టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్: నిర్మలా సీతారామన్‌

టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్: నిర్మలా సీతారామన్‌

దేశంలో  టూరిజాన్ని  ప్రమోట్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు కేంద్ర అర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో  గురువారం  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25పై మంత్రి ప్రసంగించారు. దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ఆమె తెలిపారు. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్ ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్దికి మౌళిక వసతులను పెంచనున్నట్లు చెప్పారామె. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు నిర్మలా సీతారామన్.  

ప్రజల ఆకాంక్షల మేరకు అయోధ్యలో రామాలయం నిర్మించామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారతే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. దేశంలో  పౌర విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నామని..1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ కూడా ఇచ్చామని ఆమె తెలిపారు. దేశంలోని  మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెస్తున్నామని.. మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.