
చండీగఢ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంజాబ్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ చెప్పారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సోమవా రం ఆయన సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఖట్టర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని, రాజకీయాలు చర్చించలేదని తెలిపారు. ‘‘టైం కోసం వెయిట్ చేయాలె. ప్రస్తుతానికి అంతా బాగానే జరుగుతోంది. మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా అనుకున్నట్టుగానే కొనసాగుతోంది. పార్టీలో చేరడానికి ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నా రు. దేవుని దయ ఉంటే.. బీజేపీ, శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్)తో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని అమరీందర్ సింగ్ అన్నారు.