ఐర్లాండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు బుమ్రా డౌటే!

ఐర్లాండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు బుమ్రా డౌటే!

న్యూఢిల్లీ:  టీమిండియా స్పీడ్‌‌‌‌స్టర్‌‌‌‌ జస్​ప్రీత్​ బుమ్రా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా ప్రస్తుతం ఎన్​సీఏ నెట్స్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పేసర్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాలో షేర్‌‌‌‌ చేశాడు. మునుపటి స్థాయిలో అతను బౌలింగ్‌‌‌‌ వేస్తున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో  వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. 

అయితే అంతకంటే ముందు జరిగే ఐర్లాండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో బుమ్రా ఆడడం అనుమానంగానే ఉంది.  మ్యాచ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌, లోయర్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ స్ట్రెస్‌‌‌‌ను అంచనా వేసుకోవాలంటే కనీసం ఒక్క మ్యాచ్​ అయినా ఆడాలి. కానీ, దీనికి ఎన్​సీఏ ఫిజియోల నుంచి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ రావడం లేదు. ‘ఐర్లాండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు సెలెక్షన్‌‌‌‌కు ముందు బుమ్రా విషయంలో ఎన్‌‌‌‌సీఏ ఫిజియోలు చీఫ్​ సెలెక్టర్​ అగార్కర్‌‌‌‌ బృందానికి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ సమర్పిస్తారు. ఇప్పటికైతే సెలెక్షన్‌‌‌‌ ప్యానెల్‌‌‌‌కు ఫిజియోల నుంచి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ రాలేదు.సెలెక్టర్లు బౌలింగ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను మాత్రమే చూడరు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.