
ప్రస్తుతం టాలీవుడ్లో మళయాలీ బ్యూటీల హవా నడుస్తోంది. ఉగ్రం సినిమాతో మరో కొత్తందంతెలుగులో సందడి చేయనుంది. ఆమె మరెవరో కాదు 2020లో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది మిర్నా మీనన్. తొలి సినిమాలోనే మోహన్ లాల్వంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఆది సాయికుమార్ తో ‘క్రేజీ ఫెలో’ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు అల్లరి నరేశ్ హీరోగా వస్తున్న ‘ఉగ్రం’ సినిమాతో మరోసారి తెలుగులో తన లక్‌ను పరీక్షించుకోనుంది. సినిమాలపై తనకున్న ఇష్టంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి వచ్చానని చెప్తున్న ఈ బ్యూటికీ.. ఉగ్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మే 5న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో మిర్నా తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది