ఇప్పట్లో రిటైర్​ కాను: రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ

ఇప్పట్లో రిటైర్​ కాను: రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ టీ20లు ఆడక దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా.. షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌పై ఆశలు మాత్రం ఇంకా వదులుకోలేదు. ఇప్పట్లో తాను ఏ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ నుంచి రిటైరయ్యే చాన్సే లేదని అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ సంకేతాలిచ్చాడు.  

వచ్చే ఏడాది విండీస్‌‌‌‌‌‌‌‌, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కు కూడా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టిన హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ మెగా టోర్నీ తర్వాత టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఆడాలని భావిస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో భాగంగా నవంబర్‌‌‌‌‌‌‌‌ 10న ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన రోహిత్‌‌‌‌‌‌‌‌ ఇప్పటి వరకు మళ్లీ షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగలేదు. 

‘అమెరికా వెళ్లి చూసి ఆనందించడం కంటే ఇక్కడికి రావడానికి మరో కారణం కూడా ఉంది. వచ్చే ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో ఇక్కడ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ మొత్తం దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. నేను కూడా ఈ టోర్నీపై దృష్టి పెట్టా’ అని రోహిత్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.