తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా..? వారాహి యాత్ర ఉంటుందా..!

తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా..? వారాహి యాత్ర ఉంటుందా..!

తెలంగాణకు పవర్ స్టార్ వస్తాడా రాడా? అన్న ప్రశ్నలకు తెరపడిపోయింది. రావడం పక్కా అని తేలిపోయింది. సింహం నిద్రపోతుందని ఫొటోలు దిగకూడదని జనసేన లీడర్లు చెబుతున్నారు. పోటీ గ్యారంటీ వచ్చాక.. తర్వాత ముచ్చటేంటన్న చర్చ మొదలైంది. ఏపీలో లెక్కలు మారిపోతున్నప్పుడు.. తెలంగాణలో లెక్కేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటి ఇచ్చారు. 32 స్థానాల్లో జనసేన పోటి చేస్తుందని తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోందట. తెలంగాణా ప్రజలు జనసేనను ఏమేరకు ఆదరిస్తారన్న అనుమానాలున్నాయట. క్షేత్రస్థాయిలో జనసేనకు పవన్ ఫ్యాన్స్ తప్పితే బలమైన లీడర్లు లేరు. ఈ టైమ్ లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తే సక్సెస్ అవుతుందా..జనసేనాని తెలంగాణ నుంచి పోటి చేస్తారా అనే చర్చ పోలిటికల్ సర్కిల్ లో బాగానే జరుగుతోందట. 

ఏపీలో ఇప్పటికే వారాహి యాత్ర చేస్తున్న పవన్..తెలంగాణలో కూడా వారాహి యాత్ర చేస్తారని తెలంగాణ జనసేన నేతలు చెప్తున్నారు. సర్కార్ పై బీజేపీ, కాంగ్రెస్ కాలు దువ్వుతున్నాయి. అటు బీఎస్సీ ఇటు వైఎస్ఆర్ తెలంగాణ సై అంటున్నాయి. ఇప్పుడు జనసేన వంతొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రాష్ట్రంలో ఎక్కడెక్కడా పోటీ చేస్తామో నియోజికవర్గాల పేర్లతో టిస్ట్ కూడా రిలీజ్ చేశారు తెలంగాణ జనసేన లీడర్లు. ఇప్పుడు జనసేన కూడా పోటీకి సిద్ధమవ్వడంతో ఎన్నికలు ఇంట్రెస్టింగా మారుతాయన్న డిస్కషన్ ఉందట.

పవన్ కల్యాన్ పోటీ చేస్తారా లేదా అనేదే హాట్ టిపిక్ గా మారిందట. చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికైతే పవన్ తెలంగాణలో పోటి చేయరట. ఏపీపైనే ఫుల్ కాన్ సంట్రేషన్ పెట్టారట. టీడీపీ పొత్తుతో వైసీపీ సర్కాన్ ని దింపేస్తామంటున్నారు పవర్ స్టార్. అయితే తెలంగాణలో జనసేన మార్క్ చూపించేందుకే పోటీకి సిద్ధమయ్యారన్న డిస్కషన్ జరుగుతోంది. 

పవన్ కు బీజేపీ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీ పరిచయాలతో తెలంగాణలో బీజేపితో పోత్తు పెట్టుకుంటారా..? బీజేపీ కోసం ప్రచారం చేస్తారా ? లేదా ఒంటిరిగానే వెళ్తారా అనే చర్చ జరుగుతోందట. ఇంకో చర్చ కూడా జరుగుతోందట. ఏపీలో టీడీపీతో ఎలాగూ పొత్తు ఉంది కాబట్టి..తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ సైకిల్ సవారీ చేసే చాన్స్ ఉండొచ్చన్న టాక్ ఉందట.  జనసేన రూట్ మ్యాప్ పై పూర్తిగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనట

ALSO READ : కొత్త సెంటిమెంటా : నాలుగు నెలలుగా కేసీఆర్ ఫాంహౌస్ ఎందుకు వెళ్లటం లేదు..?