ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లానింగ్ రెడీ చేస్తం: రోనాల్డ్ రాస్

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లానింగ్ రెడీ చేస్తం: రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45, రోడ్ నం.36  చెక్ పోస్ట్ ఏరియాలను పరిశీలించారు.

ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేటర్లు చేపట్టేందుకు ప్లానింగ్ రెడీ చేయాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పోలీసు, బల్దియా అధికారుల సమన్వయంతో ప్లానింగ్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.