కులగణన తీరాన్మంపై బీసీ సంఘాలు హర్షం

కులగణన తీరాన్మంపై బీసీ సంఘాలు హర్షం

బషీర్ బాగ్, వెలుగు :  కులగణన లెక్కలు రాగానే బీసీలకు పంచాయతీ రాజ్ రిజర్వేషన్లను 22  నుంచి 42 శాతానికి పెంచాలని జాతీయ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. అసెంబ్లీ లో కులగణన తీర్మానాన్ని ప్రవేశ పెట్టినందుకు, బీసీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, స్కాలర్ షిప్ లు పెంచాలని, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు, ఫీజులు బకాయిలు చెల్లించాలని, గ్రీన్ చానల్ ద్వారా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయనతో పాటు వివిధ బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

శుక్రవారం కాచిగూడ లో 14 బీసీ సంఘాలు జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జనగణనలో  కులగణన లెక్కలు  చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశంలో ఐకమత్యంతో ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్, నందా గోపాల్, జి. భరత్, రాజేందర్, అనంతయ్య, పి. సుధాకర్, జి. అంజి, వేముల రామకృష్ణ, కోట్ల శ్రీనివాస్, జోషి రాఘవ తదితరులు పాల్గొన్నారు.