కోహ్లీ రికార్డు రోహిత్ బద్దలు కొట్టేనా..?

కోహ్లీ రికార్డు రోహిత్ బద్దలు కొట్టేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్తో జరిగే చివరి వన్డేలో రోహిత్ ఈ రికార్డును సాధించే అవకాశం ముంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు కెప్టెన్ గా 132 సిక్సర్లు కొట్టాడు. అయితే భారత కెప్టెన్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 138 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే న్యూజిలాండ్తో జరిగే చివరి వన్డేలో రోహిత్ శర్మ మరో నాలుగు సిక్సర్లు బాదితే..కోహ్లీని సమం చేస్తాడు. ఐదు సిక్సర్లు కొడితే మాత్రం కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి..రెండో స్థానానికి చేరుకుంటాడు. 

భారత కెప్టెన్‌గా  ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం  మూడో స్థానంలో ఉన్నాడు. కివీస్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 2 సిక్సర్లు బాదడంతో అతను సౌరవ్ గంగూలీ(132)ని సమం చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 211 సిక్సర్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. మహ్మద్ అజారుద్దీన్ 61 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.