కరోనా నెగటివ్‌ వచ్చినోళ్లని పంపిస్తం

కరోనా నెగటివ్‌ వచ్చినోళ్లని పంపిస్తం
  • క్లారిటీ ఇచ్చిన యూఏఈ
  • లాక్‌డౌన్‌, ఫ్లైట్లు లేకపోవడంతో
  •  యూఏఈలో ఇరుక్కుపోయిన మనోళ్లు

దుబాయ్‌: లాక్‌డౌన్‌, ఫ్లైట్లు లేకపోవడంతో యూఏఈలో ఇరుక్కుపోయిన మనోళ్లకు టెస్టులు చేసి కరోనా నెగటివ్‌ వచ్చిన వాళ్లందర్నీ ఇండియాకు తిప్పి పంపుతామని యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారెన్‌ అఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ప్రకటించింది. ఈ విషయమై భారత రాయబార కార్యాలయం, మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇండియాకు వెళ్లాలనుకునే వారికి టెస్ట్‌లు చేసి కరోనా నెగటివ్‌ వస్తే పంపిస్తామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి హోమ్‌ ఫెసిలిటీస్‌తో ట్రీట్‌మెంట్‌ ఇస్తామని చెప్పారు. పరీక్షలు చేసేందుకు తమ దగ్గర మంచి ఫెసిలిటీస్‌ ఉన్నాయని, తమ సొంత దేశానికి వెళ్లేందుకు కచ్చితంగా హెల్ప్‌ చేస్తామని యూఏఈ గవర్నమెంట్‌ హామీ ఇచ్చింది.