
గువాహటి: అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ఉపయోగించిన డూప్ వివరాలను త్వరలోనే బయటపెడతానని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. రాహుల్ డూప్ పేరు, అడ్రస్ తెలియజేస్తానని తెలిపారు. శనివారం సోనిట్‌పుర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.“నేను మాటల మనిషిని కాను, రాహుల్ డూప్‌ను రూపొందించిన విధానం, పేరు వంటి వివరాలన్నీ త్వరలో బయటపెడతా. దీనికి కొంచెం సమయం పడుతుంది. ఇయ్యాల ముఖ్యమైన పని మీద నేను దిబ్రూగఢ్ వెళ్తున్నాను. రేపు గువాహటి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చాక అన్ని వివరాలు బయటపెడతా” అని హిమంత చెప్పారు.