పన్నుల భారంతో..మిడిల్​ క్లాస్​ సతమతం

పన్నుల భారంతో..మిడిల్​ క్లాస్​ సతమతం

న్యూఢిల్లీ:ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మన మధ్యతరగతి జనం బడ్జెట్​లో ఏదైనా పన్ను మినహాయింపు ఉంటుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బేసిక్​ లిమిట్​(రూ.ఐదు లక్షలు) స్లాబ్​ను ఎత్తివేస్తామన్న  వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తమదీ మధ్యతరగతి కుటుంబమేనని, వారి ఆందోళనలను అర్థం చేసుకోగలనని అన్నారు. మధ్యతరగతిపై కొత్తగా ఎటువంటి పన్నులూ వేయడం లేదని చెప్పారు. మెట్రోరైళ్లు, స్మార్ట్-సిటీ వంటి వాటికి విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తున్నందున పన్నుల భారం కొంత వరకు ఉంటుందన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల వల్ల మధ్యతరగతికి మేలే జరుగుతున్నప్పటికీ, పన్నుల భారాన్ని తగ్గించాలని కోరడం అత్యాశేమీ కాదు.  మనదేశంలో ధనవంతులు చాలా తక్కువ. పేదలు ఎక్కువ. భారతదేశంలో పన్ను-మినహాయింపు చాలా మందికి వర్తిస్తుంది. దీని వలన అంతిమంగా మధ్యతరగతిపై భారం పడుతోంది. తాజా సర్వే ప్రకారం.. 30శాతం భారతీయ కుటుంబాలు 'మధ్యతరగతి' కేటగిరీలోకి వస్తాయి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 లక్షల నుండి రూ.30 లక్షల మధ్య ఉన్న వారిని మధ్యతరగతిగా గుర్తించారు. మొత్తం మూడుశాతం కుటుంబాలను మాత్రమే ధనికులుగా (ఆదాయం రూ.30 లక్షలకుపైగా) గుర్తించారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది సంపాదన చాలా తక్కువగా ఉంది. ఒక వ్యక్తి ఏడాది ఆదాయం రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే  30శాతం టాప్-స్లాబ్ పరిధిలోకి వస్తాడు. కోట్ల రూపాయల్లో సంపాదించే వ్యక్తులు 40శాతం స్లాబ్​లో ఉంటారు.  వీళ్లు అదనంగా సర్‌‌చార్జిని చెల్లించాలి.  

ఖర్చులతో జేబు గుల్ల..

మధ్యతరగతి సంపాదిస్తున్న దానిలో మూడింట ఒక వంతు కనీస అవసరాలకే ఖర్చు అవుతున్నది. ధనిక దేశాల ఖర్చుతో పోలిస్తే మనవాళ్లు పెడుతున్న ఖర్చు చాలా తక్కువ. అమెరికాలో అత్యధిక ఆదాయపు పన్ను రేటు 37శాతం. ​ సంవత్సరానికి 1,70,000 డాలర్ల (దాదాపు రూ.1.38 కోట్లు) కంటే ఎక్కువ సంపాదించినా 32 శాతానికి మించి పన్ను చెల్లించడు.  85,000 డాలర్లు (దాదాపు రూ.69,14,537) సంపాదించే వాళ్లు పన్నే కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మధ్య స్థాయి సంపాదన కలిగిన ధనిక దేశం కాబట్టి ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుంది. పన్నుభారాన్ని అందరూ సమానంగా పంచుకోవచ్చు. భారతదేశంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. మధ్యతరగతి జేబుపై అధికభారం ఉంటోంది. ధనికుల మాదిరిగా మధ్యతరగతిపై పన్నుల విధించడం ఆపాలి. ఇందుకోసం స్లాబ్‌‌లను మార్చాలి. కెనడా, నార్వేలో మాదిరిగా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత పన్ను చెల్లించేలా చేయాలి. ఎప్పటిలాగే ధనికులకు ఎక్కువ పన్ను ఉండాలి.

మరిన్ని వార్తలు