జాబులు ఇచ్చుడా..పరీక్షలు వాయిదా వేసుడా : బల్మూరి వెంకట్ డిమాండ్

జాబులు ఇచ్చుడా..పరీక్షలు వాయిదా వేసుడా : బల్మూరి వెంకట్ డిమాండ్
  •  కేటీఆర్ సమాధానం చెప్పాలి 

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలు ఇవ్వమంటారా లేక పరీక్షలను వాయిదా వేయమంటారా..? సమాధానం చెప్పాలని కేటీఆర్ ని ఎమ్మెల్సీ, ఎన్ఎఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలనే విషయంలో అసలు బీఆర్ఎస్ కు క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

గత బీఆర్ఎస్ పాలనలో  5 వేల500ల పోస్టులతో డీఎస్సీ ఇస్తే, తమ ప్రభుత్వం11 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీకేజీలు జరిగాయని గుర్తుచేశారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ఏమి చేసిందో చర్చ పెడితే తాను వస్తానని సవాల్ విసిరారు.

 జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగతా డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను ఆగం పట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మి ఆగం కావద్దని కోరారు. ఇబ్బంది పడుతున్న ప్రతి విద్యార్థి గురించి తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని,  విద్యార్థి, నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని బల్మూరి పేర్కొన్నారు.