డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో వస్తే ఎవరితోనైనా పని చేయడానికి రెడీనే

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో వస్తే ఎవరితోనైనా పని చేయడానికి రెడీనే

కెరీర్ ప్రారంభం నుంచి కూడా కొత్త డైరెక్టర్లతోటి, టాలెంట్ ఉన్న యంగ్ దర్శకుల తోటి వర్క్ చేయడానికి ఆసక్తి చూపించారు నాగార్జున. ఇప్పటికీ ఆయన అదే ఫాలో అవుతున్నారు. బిగ్ డైరెక్టర్స్‌‌తోనే వర్క్ చేయాలనుకోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో వస్తే ఎవరితోనైనా పని చేయడానికి రెడీ అంటున్నారు. రీసెంట్‌‌గా ఓ న్యూ ప్రాజెక్టుకి ఆయన సైన్ చేసినట్లు తెలిసింది. ‘కార్తికేయ’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న చందు మొండేటి చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన నాగ్.. అతని డైరెక్షన్‌‌లో నటించడానికి ఎస్ చెప్పారట. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ ప్రమోషన్స్‌‌తో బిజీగా ఉన్నాడు చందు. ‘ద ఘోస్ట్’ మూవీ షూటింగ్‌‌తో నాగార్జున కూడా బిజీగానే ఉన్నారు. ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌‌కి వెళ్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. మరోవైపు బిగ్‌‌బాస్ ఆరో సీజన్‌‌ని హోస్ట్ చేయడానికి నాగ్ రెడీ అవుతున్నారు. రీసెంట్‌‌గా ప్రోమో కూడా విడుదలయ్యింది. మొదటి రెండు సీజన్స్ వేరే హీరోలు హోస్ట్ చేసినా.. మూడో సీజన్‌‌లో నాగ్ హోస్టింగ్‌‌కి ప్రేక్షకులు ఫిదా అవడంతో ఆయనే కంటిన్యూ అవుతున్నారు. మరోవైపు బాలీవుడ్‌‌లో ప్రెస్టీజియస్‌‌గా రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫ్రాంచైజీలోనూ నటిస్తున్నారు. మొత్తానికి అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకుల్ని సమానంగా ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేస్తూ ఇప్పటికీ అదే స్పీడ్ చూపిస్తున్నారు నాగార్జున.