వింబుల్డన్కు వీడ్కోలు సందర్భంగా సానియా భావోద్వేగం

వింబుల్డన్కు వీడ్కోలు సందర్భంగా సానియా భావోద్వేగం
  • వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్లో ఓడిన అనంతరం.. ఐ మిస్ యూ అంటూ సానియా ప్రకటన
  • సానియా భావోద్వేగ ప్రకటనపై స్పందించిన వింబుల్డన్

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో కీలక ఘట్టం ముగిసింది. టెన్నిస్ లో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ కు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది. ఇవాళ జరిగిన మిక్స్ డ్ డబుల్స్ సెమీస్ మ్యాచ్ లో ఓటమి తర్వాత సానియా మీర్జా భావోద్వేగానికి లోనైంది. ఈ వేదికపై తనకిదే చివరి మ్యాచ్ అంటూ.. ఎంతో పోరాటం చేసినా ఓటమిపాలు కావడంతో ఒకింత అసంతృప్తితో నిట్టూర్పు విడిచింది. తన అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె అంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. 

2015  వింబుల్డన్ మహిళల డబుల్స్ గెలిచిన సానియా

2015లో వింబుల్డన్ మహిళల డబుల్స్ గెలిచి భారత పతాకం రెపరెపలాడించింది సానియా. అదే ఊపును కొనసాగిస్తూ  విమెన్స్ డబుల్స్ లో యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ లను గెలిచి సత్తా చాటింది. అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ఆటతీరుతో మిక్స్ డ్ డబుల్స్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లలో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతేకాదు విమెన్స్ డబుల్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా కూడా నిలబడి చరిత్ర సృష్టించింది. 

పెళ్లి తర్వాత..

అయితే  పెళ్లి తర్వాత వైవాహిక జీవితం వల్ల గతంలో మాదిరిగా టెన్నిస్ పై ఏకాగ్రత సాధించలేకపోతున్నానని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. కొద్ది రోజులకే ఊహించిన విధంగానే డబ్ల్యూటీఏ సర్క్యూట్ నుంచి వైదొలగుతానని ప్రకటించింది. అయితే ఇవాళ మిక్స్డ్ డబుల్స్ చివరి మ్యాచ్ ఆడిన అనంతరం వీడ్కోలుపై సోషల్ మీడియాలో భావోద్వేగంగా పోస్టు చేసింది. 
క్రీడ మన నుండి చాలా తీసుకుంటుంది. మానసికంగా, శారీరకంగా, గెలుపోటములు.. కఠినమైన పరాజయాల తర్వాత నిద్రలేని రాత్రులు వస్తాయి. కానీ ఇవన్నీ చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయని.. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవని సానియా పేర్కొంది. కన్నీళ్లు ఆనందానికి ఎప్పటికీ కృతజ్ఘురాలై ఉంటానని స్పష్టం చేసింది. వింబుల్డన్ ఆడడం ఒక అద్భుతం.. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరంగా భావిస్తున్నా.. ఐ మిస్ యూ' అంటూ సోషల్ మీడియాలో సానియా భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. 

స్పందించిన వింబుల్డన్..

20 ఏళ్లు ఇక్కడ ఆడటం తనకు దక్కిన గౌరవం అంటూ అసానియా మీర్జా చేసిన ప్రకటనపై వింబుల్డన్ స్పందించింది. 'ఆ గౌరవం మాది సానియా' అని వింబుల్డన్ ట్వీట్  చేసింది. 2015 విమెన్స్ డబుల్స్ ఛాంపియన్ కు ఆల్ ది బెస్ట్ చెపుతున్నట్టు పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)