న్యూఢిల్లీ: డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రభుత్వం విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లోని రిఫైనరీకి వర్తించదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోర్ట్ తీర్పు ప్రకారం, సెజ్‌లో ఉత్పత్తి అయిన ఇంధనంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎగుమతి సుంకాలు వర్తించవని అన్నారు.
ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.50 విండ్ ఫాల్ ట్యాక్స్ వేసిన విషయం తెలిసిందే. పెట్రోల్ ఎగుమతులపై పన్ను వేయలేదు. ఈ పన్నును ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఇదే సమయంలో, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 తగ్గించి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంత ఉపశమనం కల్పించింది.
రిలయన్స్ జామ్‌నగర్‌లో రెండు రిఫైనరీలు నడుపుతోంది. ఇందులో ఒకటి దేశీయ మార్కెట్ కోసం కాగా, మరొకటి పూర్తిగా ఎగుమతుల కోసం సెజ్‌లో నడుపుతోంది. 2024–25లో రిలయన్స్ డీజిల్ ఉత్పత్తిలో 75శాతం సెజ్ నుంచే వచ్చింది. అందువల్ల ఈ పన్ను ప్రభావం కంపెనీపై పరిమితంగానే ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
