క్రూడాయిల్​పై విండ్​ఫాల్​ ట్యాక్స్​ జీరో

క్రూడాయిల్​పై విండ్​ఫాల్​ ట్యాక్స్​ జీరో
  •     డీజిల్​ఎగుమతిపై లీటరుకు 50 పైసలు వెంటనే అమలులోకి

న్యూఢిల్లీ: డొమెస్టిక్​ క్రూడాయిల్​పై విండ్​ఫాల్​ ట్యాక్స్​ను జీరో చేశారు. టన్ను క్రూడాయిల్​పై ఇప్పటిదాకా రూ. 3,500 చొప్పున విండ్​ ఫాల్​ ట్యాక్స్​ విధిస్తున్నారు. అంతేకాదు, డీజిల్​ ఎక్స్​పోర్ట్​పై విండ్​ ఫాల్​ ట్యాక్స్​నూ లీటరుకు 50 పైసలుకి అంటే సగానికి తగ్గించారు. ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయెల్​ (ఏటీఎఫ్​), పెట్రోల్​ల ఎగుమతులపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ను గతంలోనే జీరో లెవెల్​కు తెచ్చారు. తాజాగా వాటిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. విండ్​ఫాల్​ ట్యాక్స్​ మార్పులతో మంగళవారం నోటిఫికేషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది.

కిందటేడాది జులై 1 నుంచి ఈ విండ్​ ఫాల్​ ట్యాక్స్​ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఎనర్జీ కంపెనీలకు వచ్చే సూపర్​ నార్మల్​ ప్రాఫిట్స్​పై పన్ను వేసిన ఇతర దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది. అప్పట్లో పెట్రోలు, ఏటీఎఫ్​లపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్​పై లీటరుకు రూ. 13 చొప్పున విండ్​ ఫాల్​ ట్యాక్స్​ను అమలులోకి తెచ్చారు. మరోవైపు డొమెస్టిక్​ క్రూడ్​ ప్రొడక్షన్​పైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విండ్​ఫాల్​ ట్యాక్స్​ విధించడం మొదలు పెట్టారు.

గ్లోబల్​ మార్కెట్లలో క్రూడ్​ ఆయిల్​ రేట్ల కదలికల ఆధారంగా విండ్​ ఫాల్​ ట్యాక్స్​రేట్లను ప్రతీ పదిహేను రోజులకి ఒకసారి అప్పటి నుంచి రివ్యూ చేసి, తగిన మార్పులు చేస్తున్నారు. జామ్​నగర్​లో రిఫైనరీ కాంప్లెక్స్​ నుంచి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​), రాస్​నెఫ్ట్​ సపోర్టుతో నడుస్తున్న నయారా ఎనర్జీ కంపెనీలు...రెండూ మన దేశం నుంచి ప్రధానంగా పెట్రోలియం ప్రొడక్టులను ఎగుమతి చేస్తున్నాయి.