మా ఉద్యోగాలు కాపాడండి సారూ : డిప్యూటీ సీఎం పవన్ కు మొర

మా ఉద్యోగాలు కాపాడండి సారూ : డిప్యూటీ సీఎం పవన్ కు మొర

రైల్వే కోడూరు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. రేణిగుంట విమానాశ్రయం నుండి రైల్వే కోడూరుకు రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన కాన్వాయ్ ని మద్యం షాపు ఉద్యోగులు అడ్డుకున్నారు. రోడ్డుపైన పవన్ కాన్వాయిని ఆపిన యువకులు సేవ్ మై జాబ్ అంటూ నినాదాలు చేశారు.తమ ఉద్యోగాలు కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించారు మద్యం షాపు ఉద్యోగులు.

ప్రభుత్వ మద్యం షాప్ లో పనిచేసే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.15 వేల వేతనం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పవన్ ను కోరారు. మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు  కాంట్రాక్ట్ ఉద్యోగం నుండి తొలగిస్తారని వార్తలొస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబును 
మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్రలను కలిసినప్పటికీ ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వారి నుండి వినతి పత్రం అందుకున్న పవన్.. వారి సమస్యలను ప్రభుత్వంతో  చర్చిస్తానని హామీ ఇచ్చారు.