హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్..

హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్..

తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగ సందడి కొనసాగుతోంది..రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బోనాల పండగ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జరుపుకుంటారు. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో నగరంలో అథ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. గోల్కోండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ  క్రమంలో ఆదివారం (జూలై13 ) ఉదయం 6గంటల నుంచి మంగళవారం(జూలై15) ఉదయం 6గంటలవరకు ఉజ్జయిని మహంకాళి జాతర జరుగుతున్న ప్రదేశాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ లో వైన్స్ షాపుల బంద్ కు ఆదేశించారు నగర సీపీ సీవీ ఆనంద్. 

ALSO READ | హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొరియర్ల ద్వారా డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా..మల్నాడు కిచెన్ యజమాని సూర్య అరెస్ట్

హైదరాబాద్ లో నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. నగరంలో ఉజ్జయిని మహింకాళీ జాతర బోనాల పండుగ సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు సికింద్రాబాద్ పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట్, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్ పల్లి, మహాంకాళి, రాంగోపాల్ పేట ప్రాంతాల్లోని వైన్స్ షాపులు బంద్ చేయాలని సీపీ ఆదేశించారు. 

బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.