
హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల రోజు, అంతకు ముందు రోజు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 12న సాయంత్రం 4 గంటల నుంచి 14 వ తేదీ సాయంత్రం 4 గంటల దాకా అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు(17న) ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు లిక్కర్ అమ్మకాలు నిషేధిస్తున్నట్లు తెలిపారు.