
వింగ్స్ ఇండియా2024 ప్రదర్శన హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనుంది. జనవరి 18 నుంచి బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జనవరి 17వ తేదీ బుధవారం.. ఐఏఎఫ్, సారంగ టీం హుస్సేన్ సాగర్పై ఐదు నిమిషాల పాటు 5 హెలికాప్టర్లతో విన్యాసం చేశారు.ఈ టీమ్ లో ముగ్గురు హైదరాబాద్కు చెందిన పైలెట్లు ఉన్నారు. ఇప్పటికే సారంగ టీం 350 షోలను ఇండియాలో నిర్వహించింది. గాలిలో హెలికాఫ్టర్లు చేస్తున్న విన్యాసాలను చూస్తూ నగర వాసులు కేరింతలు కొట్టారు.
సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులపాటు వింగ్స్ ఇండియా ఈవంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన పలు రకాల ఎయిర్ క్రాఫ్ట్ లు కనువిందు చేయనున్నాయి.
Get ready to witness the sky transform into a canvas of innovation as #WingsIndia2024 takes flight! Celebrate India's phenomenal rise as the world's third-largest domestic aviation market and join us for an extraordinary experience that promises to redefine the way +
— Wings India 2024 (@WingsIndia2024) January 5, 2024
(1/3) pic.twitter.com/bgR99lLwwA