ఇండ్లు ఇవ్వని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లను తరిమికొట్టండి : సీతక్క

ఇండ్లు ఇవ్వని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లను తరిమికొట్టండి : సీతక్క

ములుగు, వెలుగు : ఇండ్లు ఇవ్వని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లను తరిమికొట్టాలని మహిళా కాంగ్రెస్‌‌‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలను వాడుకుంటున్నారని విమర్శించారు. ములుగులోని దళితకాలనీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు.

తొమ్మిదేళ్లలో చేయని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ధనిక రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌దేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌‌‌ హయాంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌‌‌‌కు అవకాశం ఇస్తే ఆరు గ్యారంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ వైపే చూస్తున్నారన్నారు.

కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మల్లాడి రాంరెడ్డి, కిసాన్‌‌‌‌ సెల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు బానోతు రవిచందర్, బీసీ సెల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే..

మంగపేట, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మంగపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ మండవ రామకృష్ణ కాంగ్రెస్‌‌‌‌లో చేరడంతో ఆయనకు కండువా కప్పారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ప్రజలను ఓటు బ్యాంక్‌‌‌‌గానే చూస్తోందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌‌‌‌ ఇర్సవడ్ల వెంకన్న, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్‌‌‌‌ పూజారి సురేందర్‌‌‌‌బాబు పాల్గొన్నారు.