రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలిగాలులు

రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలిగాలులు

రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. చలి పెరగడంతో ప్రజలు ఉదయాన్నే బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో ఈ చలి ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్ జిల్లాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. కొమురంభీం జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని గిన్నెదరిలో అత్యల్పంగా 9.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ లో 9.4 డిగ్రీలు, తిర్యానిలో 10.6 డిగ్రీలు, వాంకిడిలో 10.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 9.7 డిగ్రీలు, బజార్ హతనూర్ 10.3 డిగ్రీలు, బేలలో 10.7 డిగ్రీలు, లోకారిలో 10.8 డిగ్రీలు నమోదుకాగా.. నిర్మల్ జిల్లా పెంబిలో 10.5, జామ్ 11.6, ఖానాపూర్ 11.9, వానల్ పాడ్ 12.0, సారంగాపూర్ 12.1, సొన్ 12.2, కడెం పెద్దూర్ 12.5, వడ్యాల్ 12.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

For More News..

మన వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను ఎదుర్కోగలవు

హైదరాబాద్ లో కంటైన్‌‌మెంట్ జోన్‌‌

ఒమిక్రాన్ కు మరో మూడు​ కొత్త లక్షణాలు