విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రాజీనామా...

విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రాజీనామా...

టెక్ దిగ్గజం విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా శ్రీనీ పల్లియా నియమితులయ్యారు.విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) థియరీ డెలాపోర్టే రాజీనామా చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ప్రకటించింది. టెక్ దిగ్గజం విప్రో శ్రీనివాస్ పల్లియాను కొత్త సీఈవోగా ప్రకటించింది. ఏప్రిల్ 6,2024 నుంచి అమలులోకి వచ్చే విధంగా థియరీ డెలాపోర్టే రాజీనామాను డైరెక్టర్ల బోర్డు గుర్తించింది. 

డెలాపోర్టే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని,  మే 31, 2024 వరకు కంపెనీ ఉద్యోగ బాధ్యతలనుంచి తప్పుకుంటారని విప్రో తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి శ్రీనివాస్ పల్లియా నిమాయకం అమల్లోకి వస్తుందని, ఐదేళ్ల పాటు ఆయన విప్రో సీఈవోగా కొనసాగుతారని చెప్పింది. 

2020లో విప్రో సీఈవోగా చేరిన డెలాపోర్టే నాలుగేళ్లుగా సీఈవోగా , ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. విప్రోను ముందుకు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. కొత్త సీఈవో శ్రీనివాస్ పల్లియా మూడు దశాబ్దాలుగా విప్రోలో పనిచేస్తున్నారు. విప్రో కన్ స్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గా, అమెరికాస్ 1 సీఈవోగా పనిచేశారు. 
 

 విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా  విప్రో సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంది..ఈ కీలకసమయంలో విప్రోను నడిపించేందుకు శ్రీని ఆదర్శవంతమై నాయకుడు. గత మే నెలాఖరు వరకు థియరీ సీఈవోగా కొనసాగుతారని,కొత్త సీఈవో శ్రీని పల్లియాకు శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులేటరీ ప్రకారం.. శ్రీని న్యూజెర్సీలో ఉంటారు.. చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ రిపోర్ట్ చేస్తారు.