విప్రో చేతికి మైండ్ స్ప్రింట్.. డీల్ విలువ రూ.3,494 కోట్లు

విప్రో చేతికి మైండ్ స్ప్రింట్.. డీల్ విలువ రూ.3,494 కోట్లు

న్యూఢిల్లీ:  ఐటీ సేవల సంస్థ విప్రో.. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఓలమ్ గ్రూప్ ఐటీ విభాగం మైండ్‌‌ స్ప్రింట్‌‌ను 375 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.3,494 కోట్లు) కొనుగోలు చేస్తోంది. మైండ్‌‌ స్ప్రింట్‌‌లో సుమారు 3,200 మంది నిపుణులు పనిచేస్తున్నారు. 

ఈ కొనుగోలు ప్రక్రియ 2026 జూన్ 30 నాటికి పూర్తి కావచ్చు. విప్రో ఎండీ, సీఈఓ శ్రీని పల్లియా మాట్లాడుతూ ఆహార ,వ్యవసాయ రంగాల్లో ఐటీ సేవలను విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో విప్రో ఉనికిని ఇది మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.