విశాల్ కంప్లైంట్తో.. సెన్సార్ బోర్డులో పెను మార్పులు!

విశాల్ కంప్లైంట్తో.. సెన్సార్ బోర్డులో  పెను మార్పులు!

విశాల్(Vishal).. ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది. అందరు తన పోరాటానికి సలాం కొడుతున్నారు. ఎందుకంటే, ఇండస్ట్రీలో లంచం తీసుకుని..సినిమా రిలీజ్ కి పర్మిషన్ ఇచ్చే వారి గుండెల్లో గుబులు రేపుతోంది ఈ పేరు. యాక్టర్ గా, తమిళ సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా, నడిగర్ సంఘం కార్యదర్శిగా కూడా విశాల్ కి మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. విశాల్ బలంగా, ఒక్కడే గట్టిగా నిలబడటంతో..తమిళ చిత్రాలకు హిందీ సెన్సార్‌షిప్‌లో మార్పుకు దారితీసింది. త్వరలో CBFC లో పెద్ద మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

అసలు విషయానికి వస్తే..

విశాల్ హీరోగా తెరకెక్కించిన మార్క్ ఆంటోనీ( Mark Antony) మూవీ..హిందీలో రిలీజ్ చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా..ఈ మూవీ విడుదల కోసం ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి సినిమాని ప్ర‌ద‌ర్శించ‌గా..అక్కడ అధికారులు సర్టిఫికేషన్ కోసం లంచాలు డిమాండ్ చేసార‌ని ఆరోపించాడు. 

ఈ అనైతిక పద్ధతిని విశాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ..లంచానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ ను చూపిస్తూ.. ఓ వీడియో ద్వారా భారత ప్రధాని న‌రేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై విజ్ఞప్తి చేశారు. దీంతో విశాల్ కంప్లైంట్ పై రియాక్ట్ అయిన ప్రభుత్వం..CBFC కి సంబంధిత ఆఫీసర్స్ ను తక్షణమే సస్పెండ్ చేసింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..

ఇతర ప్రాంతీయ భాషల చిత్రాలు ఏ భాషలో రిలీజ్ అవ్వాలన్న ఇక ఎవ్వరికీ లంచం ఇచ్చే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన మార్పుల తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రాంతీయ భాషలకి సంబంధించిన వారు.. తమ స్టేట్ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందే అవకాశాన్ని కల్పిస్తోందని టాక్ వినిపిస్తోంది. 

Also Read :- రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న భగవంత్ కేసరి

అంటే..తమిళ చిత్రాల నుంచి హిందీ లో డబ్ చేయడానికి..సెన్సార్‌షిప్ సర్టిఫికేట్‌లను పొందాలంటే హిందీ సెన్సార్‌షిప్‌ను చెన్నై (త‌మిళ‌నాడు)లోనే నిర్వహించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమిళ మేకర్స్ .. ముంబై కి వెళ్లాల్సిన పని లేదు. త్వరలో అన్ని ఇండస్ట్రీలో ఇదే పద్దతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.