నోడల్​ ఆఫీసర్లే కీలకం : వి.పి. గౌతమ్​

నోడల్​ ఆఫీసర్లే కీలకం : వి.పి. గౌతమ్​

ఖమ్మం టౌన్, వెలుగు:  తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్ లో ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎస్ఎస్టీ బృందం దగ్గర సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయించాలన్నారు. 

యూపీఐ లావాదేవీలపై విచారణ చేయాలన్నారు.  అన్ని వాహనాలు చెక్​ చేయాలని ఆదేశించారు. ఫస్ట్ లెవల్ చెక్ తర్వాత, ఈ నెల 23, 24 తేదీల్లో కమిషనింగ్ ప్రక్రియకు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయాలన్నారు.  పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. హోమ్ ఓటింగ్ పర్యవేక్షించాలన్నారు. 

అడిషనల్ బ్యాలెట్ యూనిట్ల చెక్  

జిల్లాకు చేరిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ఫస్ట్ లెవల్ చెకప్ ప్రక్రియ జడ్పీ ఆఫీసులో పొలిటికల్​ పార్టీల లీడర్ల సమక్షంలో   ఎన్నికల అధికారి, కలెక్టర్  గౌతమ్ సోమవారం  నిర్వహించారు. ఈసీ  అదనంగా 894 బ్యాలెట్ యూనిట్లు పంపించిందని తెలిపారు. 23, 24 తేదీల్లో  చేపట్టే కమిషనింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని సూచించారు. 

22న రెండో ర్యాండమైజేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. సోమవారం నుంచి 1564 మందికి హోమ్  ఓటింగ్  సౌకర్యాన్ని వాడుకుంటారన్నారు.  కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు తుషార్ కాంత మహంత, తదితరులు పాల్గొన్నారు. 

షోకాజ్​ నోటీస్​లు ఇవ్వాలె

భద్రాద్రికొత్తగూడెం: గత నెలలో పీఓ, ఏపీఓలకు నిర్వహించిన ట్రైనింగ్​కు రాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​  ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎన్నికలపై నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. విధి నిర్వహణలో ఎలాంటి మినహాయింపు లుఉండవన్నారు. గైర్హాజరైతే ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఎన్నికల విధులు నిర్వహించే  సిబ్బంది పోస్టల్​ బ్యాలెట్​ వినియోగించుకోవాలన్నారు.  జిల్లాలోని 512 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​ కాస్టింగ్​నిర్వహణకు ఇంటర్నెట్​ సేవలు, కరెంట్​ సప్లైలో లోపం లేకుండా చూడాలన్నారు. 228  సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 2.85కోట్ల నగదు సీజ్​ చేశామన్నారు.  

రూ. 2.42 కోట్లను గ్రీవెన్స్​ కమిటీ ద్వారా రిలీజ్​ చేశామన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ మధుసూదనరాజు,  అధికారులు వెంకటేశ్వర్లు, రవీంద్రనాధ్​, విద్యాలత, సులోచనారాణి, వెంకటేశ్వరాచారి, అలీం, త్రినాథ్​, రుక్మిణి, శ్రీనివాసరావు, పరంధామరెడ్డి, అభిమన్యుడు పాల్గొన్నారు.