స్మార్ట్ టీవీలకోసం యూట్యూబ్ అప్ డేట్ 

స్మార్ట్ టీవీలకోసం యూట్యూబ్ అప్ డేట్ 

ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ తరహాలో యూట్యూబ్ షాట్స్ కి కూడా బాగా పాపులారిటీ వచ్చింది. అయితే, స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్‌ చూసేవాళ్లకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త అప్ డేట్ ని తీసుకొచ్చింది యూట్యూబ్. ఈ అప్ డేట్ తో స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్ సరికొత్తగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి.

ఫోన్లో వచ్చినట్టే టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్ వర్టికల్ గా (నిలువు) ప్లే అవుతాయి. ల్యాండ్ స్కేవ్ మోడ్ లో మాత్రమే బెస్ట్ పిక్చర్ చూపిస్తాయి. టీవీల్లో షార్ట్స్ చూస్తుంటే వీడియో స్క్రీన్ మధ్యలో ప్లే అవుతూ, చుట్టంతా తెల్లగా కనిపిస్తుంది. దానివల్ల వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ సరిగా కనిపించదు. ఈ అప్ డేట్ లో రీ డిజైన్డ్ యూఐతో షార్ట్ వీడియోని ఫుల్ స్క్రీన్ చేస్తారు. బార్డర్ లో ఉండే వైట్ లైన్స్ కూడా పోయి వీడియోకు తగ్గ కలర్స్ వస్తాయి. వీడియో టైటిల్, క్రియేటర్ పేరు, షార్ట్ కి వాడిన సౌడ్ యూట్యూబ్ షార్ట్ కి కుడివైపున ఈ అప్ డేట్ ద్వారా కనిపిస్తాయి. పాజ్ అండ్ ప్లే ఆప్షన్ ని కూడా తీసుకురానున్నారు.