అమెరికన్ల కొంప ముంచుతున్న ట్రంప్ టారిఫ్స్.. ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు లాస్..!

అమెరికన్ల కొంప ముంచుతున్న ట్రంప్ టారిఫ్స్.. ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు లాస్..!

US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న విధంగా ప్రపంచంలోని అనేక దేశాలపై వరుసగా పన్నులు ప్రకటిస్తూనే ఉన్నారు. తన మాట కాదని తమ దేశంతో వ్యాపారానికి అంగీకరించని దేశాలపై చాలా సీరియస్ గా ఉన్నాడు ట్రంప్. అయితే ట్రంప్ తీసుకొస్తున్న టారిఫ్స్ ఇతర దేశాలతో పాటు తమ పౌరులకు కూడా పెద్ద ప్రమాదాన్ని కలిగించనున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. 

ట్రంప్ మెగా టారిఫ్స్ అమెరికన్లపై భారాన్ని మోపుతాయని ఏల్ యూనివర్సిటీ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. దక్షిణ కొరియా, ఇండియా లాంటి స్నేహితులపై కూడా ట్రంప్ భారీ సుంకాలు అక్కడి ప్రజల గృహ ఖర్చులను పెంచటంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా చేస్తాయని పేర్కొంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్స్ కారణంగా స్వల్ప కాలంలో ఒక్కో అమెరికన్ ఇంటి ఆదాయం 2వేల 400 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.2లక్షల వరకు నష్టపోతారని తేల్చింది ఏల్ రిపోర్ట్.

1930 తర్వాత అమెరికా ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించటం ఇదే తొలిసారిగా ఏల్ పేర్కొంది. ప్రధానంగా ట్రంప్ చర్యలు అమెరికాలోని అప్పాదాయ వర్గాలను ప్రభావితం చేయనుందని తేలింది. పేదలపై మరింత మోయలేని భారం పడనుందని రిపోర్ట్ చెబుతోంది. అల్పాదాయ వర్గాల కుటుంబాలు సగటన వెయ్యి 300 డాలర్లు నష్టం వాటిల్లనుందని రిపోర్ట్ చెప్పగా.. ఇక అధిక ఆదాయ వర్గాలు 5వేల డాలర్లు అంటే రూ.4 లక్షల వరకు నష్టపోనున్నట్లు తేల్చింది. 

►ALSO READ | ట్రంప్ 25% టారిఫ్స్ : ప్రమాదంలో పడ్డ ఇండియా వ్యాపారాలు ఇవే.. ఫుల్ డిటైల్స్..

ట్రంప్ తెస్తున్న సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగిత పెరుగుదలకు దారితీస్తుందని వెల్లడైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 0.5 శాతం తగ్గటంతో పాటు ఏడాది చివరి నాటికి 5లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. మరో పక్క యూఎస్ ట్రెజరీకి ట్రంప్ టారిఫ్స్ కారణంగా 167.7 బిలియన్ డాలర్లు అంటే రూ.14 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనే అంచనాలు ఉన్నాయి.