ట్రంప్ 25% టారిఫ్స్ : ప్రమాదంలో పడ్డ ఇండియా వ్యాపారాలు ఇవే.. ఫుల్ డిటైల్స్..

ట్రంప్ 25% టారిఫ్స్ : ప్రమాదంలో పడ్డ ఇండియా వ్యాపారాలు ఇవే.. ఫుల్ డిటైల్స్..

Trump’s 25% Tariffs: భారతదేశాన్ని నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జన్యుమార్పిడి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ ఉత్పత్తులను దిగుమతికి అనుమతించకపోవటంతో ఇండియాపై ట్రంప్ కోపంగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే మిత్రదేశం అంటూ సంబోధిస్తూనే 25 శాతం వాణిజ్య సుంకాలను ప్రకటించారు ట్రంప్. అయితే ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తున్న యూఎస్ కొత్త టారిఫ్స్ అనేక భారతీయ వ్యాపారాలను దెబ్బతీయనుంది. 

అమెరికా తాజాగా ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ కారణంగా నష్టపోయే రంగాలు ఇవే..

1. ముందుగా అమెరికా టారిఫ్స్ దెబ్బతగిలేది జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి. సుంకాలతో ఎగుమతులు దెబ్బతిని వేల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని జ్యువెలరీ ఎగుమతి సంఘం వెల్లడించింది. అమెరికాకు ఏటా రూ.80వేల కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతుంటాయని.. అయితే ప్రస్తుత టారిఫ్స్ ఖర్చులను పెంచి వ్యాపార మందగమనానికి దారితీయవచ్చనే భయాలు పెరిగాయి. 

2. ఇక ట్రంప్ టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా చూసే మరో రంగం ఫార్మా. ఏటా అమెరికాకు రూ.64వేల కోట్ల విలువైన మందులను ఇండియన్ కంపెనీలు ఎగుమతి చేస్తుంటాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా వంటి సంస్థల ఆదాయంలో 30 శాతం కేవలం యూఎస్ మార్కెట్ల నుంచే వస్తుంటుంది. కానీ ప్రస్తుతం ప్రకటించిన టారిఫ్స్ ఈ వ్యాపారాన్ని దెబ్బతీయనుంది. 2022లో అమెరికాలో ప్రతి 10 ప్రిస్కిప్షన్లలో 4 మందులు భారత కంపెనీలవే ఉండేవి. 

3. అమెరికా సుంకాలతో ఇబ్బందులు ఎదుర్కోనున్న మరో రంగం టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్స్. అమెరికాలోని అతిపెద్ద రిటైల్ సంస్థలకు ఇండియా నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. ది గ్యాప్, పెపె జీన్స్, వాల్ మార్ట్, కాస్ట్ కో వంటి సంస్థలు కొనుగోళ్లు చేపట్టేవి. ట్రంప్ ప్రకటనతో వర్థమాన్ టెక్స్ టైల్స్, వెల్ స్పన్, ఇండో కౌంట్, అరవింద్ వంటి సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. 

4. టారిఫ్స్ ప్రభావం భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై కూడా ఎక్కువగానే ఉండనుంది. వాస్తవానికి చైనాపై అమెరికా టారిఫ్స్ కారణంగా ఎక్కువగా ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేసి అమెరికాక పంపబడుతున్నాయి. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆపిల్ తన భారతీయ ఉత్పత్తి నిర్ణయాన్ని తిరిగి మార్చుకోవాల్సి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరగితే ఫోన్ల ఎగుమతిలో సాధించిన విజయం మట్టికరిచే ప్రమాదం ఉంది.

5. ఇక చివరిగా అమెరికా టారిఫ్స్ ప్రభావం దేశంలోని ఆయిల్ రిఫైనింగ్ సంస్థలను కూడా ప్రభావితం చేయనుందని తేలింది. రష్యా నుంచి దాదాపు 37 శాతం క్రూడ్ దిగుమతులను ఇండియాలోని రిఫైనరీలు చేస్తున్నాయి. కానీ టారిఫ్స్ కారణంగా ఇది సాధ్యం కాదు. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా నుంచి రోజుకు 5లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతికి రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ప్రస్తుతం ఇది జరగటం కష్టతరమని తెలుస్తోంది. 

ఇదే క్రమంలో ఇరాన్ వాణిజ్యంపై అమెరికా ఆంక్షల వల్ల దెబ్బతిన్న 6 భారతీయ కంపెనీల జాబితా ఇదే.. 
* ఆల్కేమికల్ సోల్యూశన్స్ ప్రైవేట్ లిమిటెడ్
* ఎన్సా షిప్ మ్యానేజమేంట్ ప్రైవేట్ లిమిటెడ్
* గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్
* జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్
* కాంచన్ పాలీమర్స్
* పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్
* రామ్నిక్లాల్ ఎస్ గోసాలియా అండ్ కమ్పని


ఈ కంపెనీలు అక్రమంగా ఇతర దేశాలకు చమురును ఇరాన్ నుంచి ఎగుమతి చేయటంలో షిప్పింగ్ ఫెసిలిటీ నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్లు అమెరికా పేర్కొంది. భారతీయ కంపెనీలు ఇరానియన్ సంస్థలకు చెల్లింపులు చేసినట్లు కూడా అమెరికా గుర్తించింది.