Healthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!

Healthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!

నూనె పోసి వండటమే కాదు, కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పిండినా పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా.. కూరగాయలను చిన్న చిన్న ముక్కలు కోసి వాటిలో ఉండే నీటితోనే వండాలి. నూనె వాడకుండా మజ్జిగలో ఉడకబెట్టి కూడా వేపుళ్లు చేసుకోవచ్చు.. దానివల్ల పోషకాలు బయటకు పోవు. నూనె ఉండదు కాబట్టి బరువు కూడా సులువుగా తగ్గుతారు. అవి ఇలా చేయొచ్చు..

బెండకాయ వేపుడు

కావాల్సినవి

  • బెండకాయ ముక్కలు: ఒక కప్పు, 
  • కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు 
  • పల్లీల పొడి: ఒక టేబుల్ స్పూన్, 
  • నువ్వుల పొడి : ఒక టేబుల్ స్పూన్ 
  • పచ్చి శెనగ పప్పు పొడి : ఒక టేబుల్ స్పూన్
  • మినపప్పు పొడి: ఒక టేబుల్ స్పూన్
  • మినపప్పు : ఒక టీ స్పూన్, 
  • పచ్చిశెనగ పప్పు: ఒక టీ స్పూన్ 
  • కరివేపాకు : రెండు రెమ్మలు
  • కారం : ఒక టేబుల్ స్పూన్, 
  • కొత్తిమీర తరుగు: పావు కప్పు

తయారీ..

బెండకాయలు శుభ్రం చేసి ముక్కలుగా కోసి తడిలేకుండా ఆరబెట్టాలి. తర్వాత స్టవ్ మీద నాన్స్టిక్ పాన్ పెట్టి మినపప్పు, పచ్చిశెనగ పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. అవి వేగాక బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఆవిరితో ఉడికించాలి. అవి వేగాక కొబ్బరి తురుము, పల్లీల పొడి, నువ్వుల పొడి, పచ్చిశెనగ పప్పు పొడి, మినపప్పు పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాల పాటు వేగించాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నూనె లేని రుచికరమైన 'బెండకాయ వేపుడు' రెడీ. వయసు మళ్లిన వాళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినలేని వాళ్లు ఇది చేసుకుని తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు దీన్ని వారానికి రెండు మూడు సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.

ALSO READ :- వెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!