
కరోనా వైరస్ తో ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. పొరపాటున ఎవరన్నా దగ్గితే చాలు. దగ్గొస్తుంటే నోటికి ఏదైనా అడ్డం పెట్టుకోవచ్చు కదా..? ఛీ ఛీ అనవసరంగా మాస్క్ తెచ్చుకోకుండా వచ్చానే..? అంటూ లోలోపల గొణుక్కుంటాం.
అలాగే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అతనికి ఎదురుగా కూర్చున్న వృద్ధురాలు చిన్నగా దగ్గింది. అంతే వృద్ధురాలి దగ్గుతో ఎదురుగా ఉన్న వ్యక్తి నోటికి ఏదైనా అడ్డుపెట్టుకొని దగ్గొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. సలహాతో మండిపడ్డ వృద్ధురాలు నేను లోలోపల దగ్గుతున్నా..? భయటకు దగ్గడం లేదని వివరణ ఇచ్చింది. అందుకు ఆ వ్యక్తి మీరు దగ్గుతుంటే నాకు అసహ్యంగా ఉందని సమాధానం ఇస్తాడు. వృద్ధురాలు కూడా “అవును, నువ్వు కూడా అసహ్యంగానే ఉన్నావు అంటూ దగ్గు రాకపోయినా దగ్గు వచ్చినట్లు యాక్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి హెడ్ ఫోన్స్, గ్లాసెస్ తీసివేసి “నువ్వు కోప్పడుతున్నావా ? నువ్వు నామీద దగ్గుతున్నావు అంటూ ఆశ్చర్యంగా అంటాడు. అందుకు ఆ మహిళ నాకు “కరోనా వైరస్ “లేదని సమాధానం ఇస్తుంది. దీంతో తన ఆ వ్యక్తి ఫోన్‌ను తీసి దగ్గుతున్నట్ల యాక్ట్ చేస్తున్న వీడియో వీడియో తీశాడు. వీడియో తీయ్యడంపై స్పందించిన వృద్ధురాలు రౌడి అని సంభోదిస్తుంది. అందుకు ఎదురుగా ఉన్న వ్యక్తి నేను మిమ్మల్ని మర్యాదగా నోటికి అడ్డుపెట్టుకొని దగ్గమన్నా. మీరే నన్ను సీరియస్ గా చూశారంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్ గా మారింది.