ఆస్తి రాసివ్వకపోతే లైంగిక కేసు పెడతా..

ఆస్తి రాసివ్వకపోతే లైంగిక కేసు పెడతా..

కామారెడ్డి: తనకు ఆస్తి రాసివ్వకపోతే లైంగికంగా వేధించావంటూ కేసు పెడతానంటూ గ్రామసర్పంచ్‌ను ఓ మహిళ బెదిరించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామ సర్పంచ్ ఇంట్లో ఓ మహిళ కొన్ని నెలల క్రితం అద్దెకు దిగింది. అనంతరం కొన్ని నెలల తర్వాత తనకు ఆస్తిలో వాటా ఇవ్వకపోతే లైంగికంగా వేధించావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ ఆ మహిళ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. దాంతో భయపడిపోయిన సర్పంచ్.. తానూ ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని పోలీస్ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో పోలీసులు.. బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. ఆమె గతంలో కూడా లింగంపేట్, ఎల్లారెడ్డి ప్రాంతంలో పలువురిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆ మహిళ నుంచి తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు పోలీసులను కోరుతున్నారు.