
హైదరాబాద్ : డీలక్స్ బస్సు ఎక్కిన మహిళ తనకు ఫ్రీ టికెట్ ఇవ్వాలంటూ హల్ చల్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ చోటు చేసుకుంది. లక్ష్మీ దేవిపల్లి మండలం శేషగిరినగర్ పంచా యతీకి చెందిన బోయ చిట్టి (36) కొత్త గూడెం బస్టాండ్లో ఖమ్మం వెళ్లే డీలక్స్ బస్సు ఎక్కింది. ఆధార్ కార్డు చూపుతూ తనకు ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్ ను అడిగింది. అయితే ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే మహిళలకు ఫ్రీ టికెట్ ఇస్తారని, డీలక్స్ లో ఉచిత ప్రయాణం లేదని కండక్ట ర్ ఆమెకు చెప్పాడు.
అయినా వినకుండా తనకు ఫ్రీ టికెట్ ఇవ్వాలని ఆమె కండక్టర్ తో వాదనకు దిగింది. దాంతో కండక్టర్ చిట్టిని చుంచుపల్లి మండలం విద్యాన గర్ లో బస్సు నుంచి కిందికి దించాడు. దాంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినమహిళ బస్సుకు అడ్డుగా పడుకొని హల్ చల్ చేసింది. బస్సు కండక్టర్, తోటి ప్రయాణికులు చెప్పినా వినక పోవడంతో కండక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు అక్కడికి చేరుకొని మహిళకు నచ్చజెప్పి పంపించారు. మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డంగా కూర్చోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.